For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: "అతిథి దేవో భవ" ను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఆది సాయికుమార్‌

09:57 PM Jan 09, 2022 IST | Sowmya
Updated At - 09:57 PM Jan 09, 2022 IST
film news   అతిథి దేవో భవ  ను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఆది సాయికుమార్‌
Advertisement

ఆది సాయి కుమార్ హీరోగా నువేక్ష హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘అతిథి దేవో భవ’. పొలిమేర నాగేశ్వర్ ద‌ర్శ‌కుడు. రాం సత్యనారాయణ రెడ్డి సమర్ఫణలో శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు. ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌లై ఆద‌ర‌ణ పొందుతోంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేసేందుకు చిత్ర యూనిట్ ఆదివారంనాడు ప్ర‌సాద్‌ల్యాబ్‌లో విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసింది.

ఈ సంద‌ర్భంగా ఆది సాయి కుమార్ మాట్లాడుతూ : సినిమా విడుద‌లైన మొద‌టి షో నుంచి బాగుంద‌ని చాలా ఫోన్లు వ‌చ్చాయి. ప్రేక్ష‌కులు మంచి సినిమాను ఎప్ప‌డు ఆద‌రిస్తారు. క‌లెక్ష‌న్లు కూడా బాగున్నాయంటున్నారు. వైజాగ్ ,సీడెడ్ ల‌లో క‌లెక్ష‌న్లు చాలా బాగున్నాయ‌ని రిపోర్ట్ వ‌చ్చింది. ఇక నా పెర్ ఫార్మెన్స్‌కూ హీరోయిన్ న‌ట‌న‌కు అప్లాజ్ వ‌స్తోంది. పాట‌లు కూడా మంచి ఆద‌ర‌ణ పొందాయి.

Advertisement GKSC

నా త‌ల్లిగా న‌టించిన రోహిణికీ, నా మ‌ధ్య వున్న స‌న్నివేశాలు హార్ట్ ట‌చింగ్ వున్నాయ‌ని తెలియ‌జేస్తున్నారు. ఇక సప్త‌గిరి కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో మ‌రో స్థాయిలో వుంది. ఎక్క‌డా వినోదం మిస్ కాకుండా ద‌ర్శ‌కుడు తీశాడు. యాక్ష‌న్ ఎపిసోడ్ హైలైట్‌గా వుంద‌ని టాక్ వ‌స్తోంది. బ‌య‌ట కోవిడ్ వంటి వాతావ‌ర‌ణ వున్నా ఇంత ఆద‌ర‌ణ పొంద‌డం ఆనందంగా వుంది. త‌ప్ప‌కుండా ఇంకా చూడ‌నివారుంటే చూసి ఆనందించండి అని తెలిపారు.Hero Adi Saikumar thanks the audience for Giving Big Hit Athidi Devo Bhava,Nuveksha,Polimera Nageshwar,KarthikSrinivas,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.latest telugu movies,

Advertisement
Author Image