Entertainment : స్టార్ హీరోయిన్ తో లవ్ లో పడిన KGF యాక్టర్.. పిక్స్ వైరల్
Entertainment : చిత్రపరిశ్రమలో వరుసగా ఒక్కోక్కరు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవల హీరో నాగశౌర్య.. బెంగుళూరుకు చెందిన అనూష శెట్టితో ఏడడుగులు వేయగా.. నటి హన్సిక కూడా బ్యాచిలర్ ఎంగేజ్మెంట్తో సర్ప్రైజ్ చేసింది. కోలీవుడ్‌కు చెందిన నటుడు గౌతమ్ కార్తీక్ నటి మంజిమా మోహన్ కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోలతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ సెలబ్రిటీ జంట ఎవరో కాదు.. హీరోయిన్ హరిప్రియ, కేజీఎఫ్ ఫేమ్ నటుడు వశిష్ఠ సింహా. ప్రస్తుతం వీరి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరూ దుబాయ్ నుండి బెంగుళూరుకి తిరిగివస్తూ ఎయిర్ పోర్టులో మీడియా కంటబడ్డారు. దీంతో విషయం కాస్త ఇండస్ట్రీ అంతా పాకింది. అయితే.. హరిప్రియ-వశిష్ఠ ఎప్పటినుండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. డిసెంబర్ మొదటి వారంలో ఎంగేజ్మెంట్.. వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకుందామని ప్లాన్ లో ఉండగా.. ఇంతలోనే విషయం బయటపడింది. అదీగాక వీరిద్దరూ పెళ్లి షాపింగ్ కోసమే దుబాయ్ కి వెళ్లారని కన్నడ సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది. ఇక ఫోటోలు చూస్తే.. హరిప్రియ – వశిష్ఠ చేతిలో చేయి వేసుకొని నడుస్తూ కనిపించారు.
కాగా, హీరోయిన్గా హరిప్రియ, నారప్ప మూవీ విలన్‌గా వశిష్ఠ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇప్పటికే హరిప్రియ హీరోయిన్గా తెలుగులో చాలా సినిమాలు చేసింది. పిల్ల జమీందార్, అబ్బాయ్ క్లాస్ అమ్మాయి మాస్, జై సింహ, బెల్ బాటమ్ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం చేతినిండా కన్నడ సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు వశిష్ఠ.. కేజీఎఫ్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుని, నయీమ్ డైరీస్, ఓదెల రైల్వే స్టేషన్ మూవీస్ చేశాడు.