For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'హను- మాన్' పాన్ వరల్డ్ కంటెంట్ వున్న చిత్రం.. విజువల్ వండర్ గా వుంటుంది : హీరో తేజ సజ్జ

12:39 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:39 PM May 13, 2024 IST
 హను  మాన్  పాన్ వరల్డ్ కంటెంట్ వున్న చిత్రం   విజువల్ వండర్ గా వుంటుంది   హీరో తేజ సజ్జ
Advertisement

తెలుగులో తొలి జాంబీ చిత్రం జాంబీ రెడ్డి ని రూపొందించిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమాలను రూపొందించడానికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ ని సృష్టించాడు. యంగ్ ట్యాలెంటడ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న హను-మాన్ మల్టీవర్స్ నుండి వస్తున్న తొలి చిత్రం. ప్రశాంత్ వర్మ ఇదివరకే తేజ సజ్జ పాత్రను ఒక గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. ఇది సినీ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచింది. తర్వాత పోస్టర్ల ద్వారా ఇతర ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. ఈ రోజు ఊహాతీతమైన కంటెంట్ తో వచ్చారు. ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో తేజ సజ్జ మాట్లాడుతూ.. హనుమాన్.. గాలి కంటే వేగంగా ప్రయాణించగలిగిన వారు, బుద్ధిలో శ్రేష్టులు, వానర యోధుల్లో ముఖ్యులు, ఇంద్రియాలని జయించినవారు, సాక్ష్యాత్తు శ్రీరామచంద్రమూర్తి దూత. ఇంతకంటే సూపర్ హీరో మనదగ్గర ఎవరున్నారు.  సూపర్ హీరో అనగానే స్పైడర్ మాన్ సూపర్ మాన్ అని భావిస్తుంటారు. సినిమాలో చూసింది వాళ్ళనే. కానీ వాళ్ళు స్ఫూర్తిపొందింది మన కల్చర్ నుండి, మన హనుమంతులవారి నుండి. వాళ్ళ సూపర్ హీరోలు ఫిక్షనల్ మాత్రమే. హనుమంతులవారు మన చరిత్ర. మన కల్చర్. ఇది మన సత్యం. అలాంటి గొప్ప దేవుడు హనుమంతుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడనేది మా హను -మాన్.

Advertisement GKSC

ఇంతగొప్ప సినిమాలో పాత్రకు న్యాయం చేస్తానని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మగారి కి థాంక్స్ చెప్పడం చిన్న మాటే అవుతుంది. ఆయన తో ఇదివరకే ఒక సినిమా చేశాను. ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాం. ప్రశాంత్ గారు గ్రేట్ క్రాఫ్ట్ మాన్. ఆయనతో ప్రతి క్షణం లెర్నింగ్ ప్రాసస్ వుంటుంది. సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. హనుమంతులవారి గురించి చెప్పినపుడు వినయం, నిజాయితీ, గొప్ప అనే మాటలు చెబుతాం. మా సినిమా కూడా అంతే వినయంగా నిజాయితీతో సినిమా చేశాం. కానీ సినిమా చాలా గొప్పగా వుండబోతుంది.

ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇస్తుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి సినిమా అంటే చాలా ప్యాషన్. అంత ప్యాషన్ వున్న నిర్మాతకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ అందరం చాలా కష్టపడి చేశాం. నాలుగు సినిమాల కష్టం ఈ సినిమా కోసం పడ్డాను. ఈ సినిమా రావడం కూడా దైవ సంకల్పం అని నమ్ముతున్ననాను. త్వరలోనే మీ అందరినీ థియేటర్ లో కలుస్తాం.

Advertisement
Author Image