For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

HANU-MAN : ఈ పండక్కి 'హనుమాన్' తో థియేటర్లో పండగ చేసుకుందాం : హీరో తేజ సజ్జ

11:49 PM Nov 28, 2023 IST | Sowmya
Updated At - 11:49 PM Nov 28, 2023 IST
hanu man   ఈ పండక్కి  హనుమాన్  తో థియేటర్లో పండగ చేసుకుందాం   హీరో తేజ సజ్జ
Advertisement

దర్శకుడు ప్రశాంత్ వర్మ, హను-మాన్ టీం తేజ సజ్జ లీడ్ రోల్ నటించిన ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్' రెండవ పాట సూపర్ హీరో హనుమాన్‌ని లాంచ్ చేసి ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. బాలల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాట చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంది. ఈ రోజు, హనుమాన్ టీమ్ చిత్రంలోని మూడవ సింగిల్ ఆవకాయ ఆంజనేయ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

మాసీ బీట్‌ లతో కూడిన ఈ గ్రూవీ ఫోక్ సాంగ్ అనుదీప్ దేవ్ అద్భుతంగా స్వరపరిచారు. అమృత అయ్యర్‌ తో పాటు వయసుమళ్ళిన మరో మహిళ ఆవకాయ ఊరగాయను సిద్ధం చేస్తున్న సన్నివేశంతో పాట ప్రారంభమవుతుంది. కొంతమంది ముసుగులు ధరించిన వ్యక్తులు ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వారిని రక్షించడానికి ఆంజనేయ స్వామి వంటి హనుమంతుడు వస్తాడు. ఆవకాయను తయారుచేసే సంప్రదాయం, యాక్షన్ ఎపిసోడ్ అద్భుతంగా బ్లెండ్ అవుతూ విజిల్స్ వేయాలనిపించేలా ఆకట్టుకున్నాయి.

Advertisement GKSC

సింహాచలం మన్నెల అందించిన సాహిత్యం మెమరబుల్ గా వుంది. సాహితీ పాటని అద్భుతంగా ఆలపించారు. వాయిస్ చాలా లైవ్లీగా వుంది. తేజ సజ్జ ఈ పాటలో పవర్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు. యాక్షన్ బ్లాక్‌లు కూడా పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశారు. హనుమాన్ చాలీసా భక్తి గీతం అయితే, సూపర్ హీరో హనుమాన్ హిలేరియస్ సాంగ్. మూడవ సింగిల్ ఆవకాయ ఆంజనేయ ఫోక్ నెంబర్. ఈ ఆల్బమ్‌లో విభిన్న జానర్‌ ల పాటలు ఉన్నాయి . ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు ఒకదానికొకటి భిన్నంగా ఆకట్టుకున్నాయి.

హీరో తేజా సజ్జ మాట్లాడుతూ.. మనకి ఆపద వస్తే ఆంజనేయ స్వామి, ఆకలేస్తే ఆవకాయ..ఇది  మన కల్చర్ లో బలంగా మనందరిలో పాతుకుపోయి వుంది. ఇదొక ఎమోషన్. అలాంటి కల్చర్ ని కమర్షియల్ వే లో చాలా గొప్పగా చూపించడానికి ప్రశాంత్ గారు ప్రయత్నించారు. దీనికి గ్రేట్ ట్యూన్ ఇచ్చిన అనుదీప్ గారికి, మంచి లిరిక్స్ ఇచ్చిన సింహా గారికి, అద్భుతంగా పాడిన సాహితి గారికి,  హిందీలో పాడిన సునీధి చౌహాన్ గారికి మలయాళంలో పాడిన సితార గారికి థాంక్స్. అద్భుతమైన ఆలోచనని అంతే అద్భుతంగా విజువలైజ్ చేసిన ప్రశాంత్ గారికి థాంక్స్. ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్ లోకి రాబోతుంది. అందరూ థియేటర్ కి వచ్చి చూడండి. ఈ పండక్కి హనుమాన్ తో థియేటర్లో పండగ చేసుకుందాం’’ అన్నారు.

Advertisement
Author Image