For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

MYTA - Malaysia Telangana Association : మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యములొ ఘనంగా బతుకమ్మ వేడుకలు

10:56 PM Oct 22, 2023 IST | Sowmya
UpdateAt: 10:56 PM Oct 22, 2023 IST
myta   malaysia telangana association   మలేషియా తెలంగాణ అసోసియేషన్  మైట  ఆధ్వర్యములొ ఘనంగా బతుకమ్మ వేడుకలు
Advertisement

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ  వేడుకల తో పాటుగా ఈ సంవత్సరం మైట పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన  దశాబ్ది ఉత్సవాలని కూడా కలిపి  ఘనంగా నిర్వహించడం తో ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  మలేషియా కౌలాలంపూర్ లోని తానియా గ్రాండ్  రూఫ్ టాప్  హాల్, TLK  కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్, కౌలాలంపూర్  లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వందలాది మహిళలు పిల్లలు సాంప్రదాయ వస్త్రధారణలో, ఆకర్షణీయమయిన పూలతో చేసిన బతుకమ్మలను అందంగా పేర్చి బతుకమ్మ ఆట పాటలతో  తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా సందడి చేశారు. దాదాపు పదిహేను వందల మందికి పైగా వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా  ఇండియన్ హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ శ్రీమతి సుష్మ గారు, మలేషియా తెలుగు ఫౌండేషన్ దాతో కాంతారావు గారు ,  తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ అఫ్ మలేషియా  ఆనంద్ గారు, నాగరాజు గారు ,ఇంద్రనీల్ గారు , మలేషియా ఆంధ్ర అసోసియేషన్ ట్రేసరర్ శ్రీనివాస్  గారు  మరియు మలేషియా తెరాస వింగ్ ప్రెసిడెంట్ చిట్టిబాబు గారు పలువురు తెలంగాణ ప్రముఖులు ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

శ్రీమతి సుష్మ గారు మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అన్నారు అలాగే ఆడపడుచులందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సంబరాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ ను ఆమె అభినందించారు.

ఈ సంధర్బముగా నిర్వహించిన ఉత్సవాలలో  ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాలా పాటలు పాడారు. రుచికరమైన తెలంగాణ వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి అలాగే అందంగా అలంకరించిన బతుకమ్మల కు మొదటి బహుమతి 3గ్రాముల బంగారు నాణెం KVT గోల్డ్ వారు, రెండొవ బహుమతి 2గ్రాముల బంగారు నాణెం జస్ బెలూన్స్ వారు, మూడవ బహుమతి 1గ్రామ బంగారు నాణెం ను దయానంద్ గారు  బహుమతులను అందజేశారు అంతే కాకుండా లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన వారికీ మైట ద్వారా  బంగారు బహుమతులను అందజేశారు.  అలాగే జస్ బెలూన్స్ అండ్ జస్ ట్రేట్జ్ వారు కన్సోలేషన్ మరియు వౌచెర్స్ ని అందజేశారు.

Grand Bathukamma celebrations under the auspices of Malaysian Telangana Association (MAITA).Tania Grand Roof Top Hall, TLK Complex, Brick Fields, Kuala Lumpur,Mrs. Sushma,

మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ... మన ఆడబిడ్డల ఆత్మీయ సంగమం , తెలంగాణ ఆత్మ గొరవ సంబరం మన బతుకమ్మ అన్నారు , తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ఈ  కార్యక్రమానికి స్పాన్సర్స్ గా వచ్చిన  అర్బన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్ , లావు టెక్ సోలుషన్స్, KVT గోల్డ్,  జాస్ డెకొరేటర్స్ ,జస్ ట్రేట్జ్ , శ్రీ  బిర్యానీ.com  రెస్టారెంట్ , మై81 రెస్టారెంట్ ,మై బిర్యానీ రెస్టారెంట్ , స్పైసి హబ్   రెస్టారెంట్ కి, మెరిడియన్ రెస్టారెంట్, సీంప్లై సి ఫుడ్ రెస్టారెంట్, వైట్ ఫిన్ మై 81 రెస్టారెంట్ లకు   ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం కావడానికి సహకరించిన మైట కోర్ కమిటీ ని వాలంటీర్లు గా ముందుకి వచ్చిన సభ్యులను, మరియు మైట సభ్యులను అయన అభినందించారు.

ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేసరర్ మారుతీ జాయింట్ ట్రేసరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రవి వర్మ,కృష్ణ వర్మ, వివేక్, రాములు, సుందర్, కృష్ణరెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, అశ్విత ,యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ - కిరణ్ గౌడ్, రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ చందు, రామ కృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు, రోజా, శ్రీలత. మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్, సందీప్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Tags :
Author Image