For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS : 'గుడ్ బ్యాడ్ అగ్లీ' హ్యుజ్ బ్లాక్ బస్టర్. అడియన్స్ కేరింతలు కొడుతూ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు : ప్రొడ్యూసర్ నవీన్‌ యర్నేని

08:14 PM Apr 13, 2025 IST | Sowmya
Updated At - 08:14 PM Apr 13, 2025 IST
film news    గుడ్ బ్యాడ్ అగ్లీ  హ్యుజ్ బ్లాక్ బస్టర్  అడియన్స్ కేరింతలు కొడుతూ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు   ప్రొడ్యూసర్ నవీన్‌ యర్నేని
Advertisement

Good Bad Ugly : వెరీ సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్‌ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంభవం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. టి-సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సంభవం సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ నిర్వహించారు.

బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ లో నిర్మాత నవీన్‌ యర్నేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ .తెలుగులో చాలా బ్లాక్ బస్టర్ తీసాము. ఈ సినిమాని రోహిణి థియేటర్స్ లో చూసాము. థియేటర్ ప్యాక్డ్ గా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఆ విజువల్ ని మర్చిపోలేను. సినిమా హ్యుజ్ బ్లాక్ బస్టర్. ఇదంతా మా హీరో అజిత్ గారి వలన. డైరెక్టర్ అధిక్ అద్భుతమైన సినిమా ఇచ్చాడు. అజిత్ గారు చాలా సింపుల్ పర్సన్. ఆయన మనసుతో మాట్లాడే మనిషి. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. అధిక్  ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఈ సినిమాని 95 రోజుల్లో పూర్తి చేశాడు.

Advertisement GKSC

ఇంత గ్రాండ్ స్కేల్ ఉన్న సినిమాని 95 డేస్ లో కంప్లీట్ చేయడం మామూలు విషయం కాదు. అధిక్ లాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీకి కావాలి. జివి గారు, ప్రియా, కార్తీక్ అందరికీ థాంక్యు. సునీల్ గారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ఈ సినిమా రెండు గంటల రోలర్ కోస్టర్ రైడ్.  ఎక్కడ ఆగదు. పరిగెడుతూనే ఉంటుంది. తమిళనాడు ఆంధ్ర,తెలంగాణ, కర్ణాటక, ఓవర్సీస్ అన్నిచోట్ల సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇది ఇక్కడితో ఆగదు. చాలా పెద్ద విజయం సాధించబోతుంది. అజిత్ గారికి టీమ్ అందరికీ మరోసారి థాంక్యూ'అన్నారు.

తారాగణం : అజిత్ కుమార్, త్రిష కృష్ణన్, ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్

సాంకేతిక సిబ్బంది :
రచన, దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్
డీవోపీ: అభినందన్ రామానుజం
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
ప్రొడక్షన్ డిజైనర్: జి ఎం శేఖర్
స్టంట్స్: సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్
స్టైలిస్ట్: అను వర్ధన్ / రాజేష్ కమర్సు
పీఆర్వో : సురేష్ చంద్ర
పీఆర్వో (తెలుగు) : వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
సౌండ్ డిజైన్: సురేన్
స్టిల్స్ : జి ఆనంద్ కుమార్
పబ్లిసిటీ డిజైన్స్ : ADFX స్టూడియో
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ నరసింహన్
CEO: చెర్రీ
నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై రవిశంకర్
సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, T సిరీస్
సహ నిర్మాత: శివ్ చన్నా
ప్రెసిడెంట్ (టి సిరీస్): నీరజ్ కళ్యాణ్

Advertisement
Author Image