For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి థియేటర్లో మోత మోగిస్తారు: సత్యదేవ్ ఇంటర్వ్యూ

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి థియేటర్లో మోత మోగిస్తారు  సత్యదేవ్ ఇంటర్వ్యూ
Advertisement

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా నిర్మిస్తున్నారు. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో సత్యదేవ్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

గాడ్ ఫాదర్ లో అవకాశం వచ్చినపుడు ఎలా ఫీలయ్యారు ?
అన్నయ్య (చిరంజీవి ) ఒక షూటింగ్ లో లంచ్ కి రమ్మని పిలిచారు. వెళ్లాను. ఒక సినిమా ఉందని కథ చెప్పడం మొదలుపెట్టారు. అన్నయ్య నాకు కథ చెప్పడం ఏమిటని ఆశ్చర్యంగా చూస్తున్నాను. నేను ఎప్పుడూ కలలో కూడా కనని వింత అనుభవం అది. నేను ఆయనకి వీర అభిమానిని, నేను గురువు గా భావించిన వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన నాకు కథ, పాత్ర చెప్పడం ఆశ్చర్యమనిపించింది. ఆయన నా వంక చూసి ''నేను సరిగ్గా కథ చెప్పడం లేదా ? పోనీ దర్శకుడితో చెప్పించనా ?'' అని అడిగారు. ''మీరు నాకు కథ చెప్పడం ఒక కలలా వుంది, నాకేం అర్ధం కావడం లేదన్నయ్యా.. మీరు చేయమని చెప్తే చేసేస్తాను.. మీరు కథ చెప్పడం ఏంటి '' అన్నాను. సినిమా చూశావా ? అని అడిగారు. ''చూడలేదు, చూడను కూడా. చేసేస్తాను'' అని చెప్పా. ఆయన అడిగిన తర్వాత మళ్ళీ చూసే ఆలోచనే లేదు. ఆ క్షణం చాలా గొప్పగా అనిపించింది. అయితే పాత్ర చేస్తున్నపుడు అందులో వున్న లోతు కొంచెం కొంచెం అర్ధమైయింది. చిన్న టెన్షన్ కూడా మొదలైయింది(నవ్వుతూ)

Advertisement GKSC

https://youtube.com/shorts/DvorTSG29Sg

చిరంజీవి గారు మీ నటన గురించి మెచ్చుకోవడం ఎలా అనిపించింది ?
అన్నయ్య ప్రశంసలు విన్నాను. దాని గురించి మాటల్లో చెప్పలేను. నాకు ఊహ తెలిసినప్పటినుండి అన్నయ్యని ఇష్టపడ్డాను. యాక్టర్ కావాలని కలలు కన్నాను. ఆయనపై వున్న ప్రేమని ఇంధనంగా వాడుకొని నటుడిని అయ్యాను. అన్నయ్య నా నటనని ప్రశంసించడం మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి. నా కల నేరవేరింది.

చిరంజీవి గారితో కలసి నటించడం ఎలా అనిపించింది ?
మాటల రచయిత లక్ష్మీ భూపాల హాయిగా మాటలు రాసేశారు. మోహన్ రాజా గారు మానిటర్ ముందు కూర్చుని యాక్షన్ చెప్తారు. వీళ్ళందరికంటే వార్ లో వున్నది నేను (నవ్వుతూ). అయితే అన్నయ్య చాలా చాలా కంఫర్ట్ జోన్ లో ఉంచారు. ఆయన షాట్ అయిపోయిన తర్వాత కూడా నాకు హెల్ప్ చేయాలని నా పక్కనే వుండేవారు. అయితే ఆయన పక్కన వుంటే నాకు టెన్షన్ (నవ్వుతూ). అయితే నటుడిగా అన్నయ్య నా మీద ఒక భాద్యత పెట్టారు. ఆ భాద్యతని సరిగ్గా నిర్వహించాల్సిన భాద్యత నాపై వుంది. ఈ భాద్యత ముందు మిగతా భయాలు తగ్గాయి.

https://youtu.be/HE1o0VFtANQ

గాడ్ ఫాదర్ కథ చిరంజీవి గారికి ఎంత యాప్ట్ అని భావిస్తారు ?
అన్నయ్య గ్రేస్, ఆరా కి వందకి వంద శాతం సరిపడే కథ ఇది. లుక్ కూడా పూర్తిగా మార్చారు. మునుపెన్నడూ కనిపించని కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. సీన్లు పేల్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ నా ఫేవరేట్. మాములుగా వుండదు. మోత మోగిస్తుంది. థార్ మార్ పాట కూడా అదిరిపోతుంది.

చిరంజీవి గారిని సెట్స్ లో చూసినప్పుడు ఎలా అనిపించింది ?
మెగాస్టార్ అని ఎందుకు అంటారో ఆయన్ని రియల్ లైఫ్ లో చూస్తే అర్ధమైయింది. ఆయన చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. చాలా ఎనర్జిటిక్ గా వుంటారు. సెట్స్ లో కూర్చోరు. హుషారుగా అటు ఇటు తిరుగుతూ ప్రతి డైలాగ్ నేర్చుకుంటూ నెక్స్ట్ సీన్ గురించి ఆలోచిస్తూ ఒక లైవ్ వైర్ లా వుంటారు. ఇందుకదా ఆయన్ని మెగాస్టార్ అని పిలిచేది అనిపించింది. తెరపై చూసి ఆయనకి అభిమాని అయ్యాను. ఆయన్ని ఆఫ్ స్క్రీన్ లో చూశాకా ఇంకాస్త ప్రేమ పెరిగింది. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఇచ్చే ఒక్కో సలహా, సూచనకి 45 ఏళ్ల అనుభవం వుంటుంది. ఆయన చెప్పారంటే కళ్లుమూసుకొని చేసేయొచ్చు. రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.

https://youtu.be/WhmTiLTnzFs

ఈ సినిమా క్లైమాక్స్ లో మీకు చిరంజీవి గారికి 14 నిమిషాల యాక్షన్ సీన్ వుందని విన్నాం? దాని గురించి ?
క్లైమాక్స్ లో 14 నిమిషాల యాక్షన్ సీన్ ఇందులో ఒక హైలెట్. దీనికంటే మించి ఇందులో చాలా వున్నాయి. ఆద్యంతం ఎత్తుకుపై ఎత్తు అన్నట్టుగా వుంటుంది.

సల్మాన్ ఖాన్ తో కలసి పని చేయడం ఎలా అనిపించింది ?
సల్మాన్ ఖాన్ సూపర్ కూల్. పెద్ద సూపర్ స్టార్ ఆయన. కానీ సెట్స్ లో చాలా సింపుల్ గా సరదాగా వున్నారు. స్టార్లు అంతా ఇలానే వుంటారు. సల్మాన్ మాత్రం ఇంకొంచెం ఎక్కువ కూల్ పర్శన్ అనిపించారు.

https://youtube.com/shorts/x4KNARc3tUg

దర్శకుడు మోహన్ రాజా గురించి ?
మోహన్ రాజా కూడా చాలా కూల్ పర్శన్. ఎప్పుడూ నవ్వుతూనే వుంటారు. సెట్స్ లో అన్నయ్య, సల్మాన్ ఖాన్, నయనతార.. ఇలా అంతా సూపర్ స్టార్లు. కానీ ఆయన నవ్వుతూనే ఉంటారు. ''సర్ మీరు టెన్షన్ తో  నవ్వుతున్నారా?'' అని అడిగానోసారి. దానికి కూడా నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. ఆయన చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ప్రతి పాత్రని అద్భుతంగా డిజైన్ చేసుకుంటారు. ముఖ్యంగా విలన్ పాత్రని. ఇందులో నా పాత్రని చాలా స్టయిలీష్, పవర్ హంగ్రీ, గ్రీడీ ఇలా చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు. ఇలాంటి పాత్రని ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. ఈ పాత్ర చాలా అద్భుతంగా వచ్చింది.

తక్కువ కాలంలో ఇంతపెద్ద సినిమాల్లో చేయడం ఎలా అనిపించింది ?
తక్కువ కాలం ఏమీ కాదు. పదేళ్ళు పట్టింది(నవ్వుతూ) నాకు ఓవర్ నైట్ సక్సెస్ రాకపోయిన ఒకొక్క శుక్రవారం కెరీర్ లో యాడ్ అవుతూ వచ్చింది. దీని వలన ఇలాంటి మంచి అవకాశాలు వస్తున్నాయని భావిస్తా.

Chiranjeevi, Salman Khan’s GodFather Mega Public Event At JNTU Ground In Anantapur On September 28th,Telugu Golden TV,www.teluguworldnow.com,My Mix Entertainments,v9 news telugu,telugu world news

సోలో హీరో గానే చేస్తారా .. మంచి పాత్రలు దొరికితే  చేసే అవకాశం ఉందా ?
అందరిలానే సోలో హీరోగా చేయాలనే వుంటుంది. అయితే మంచి పాత్రలు దొరికితే కూడా చేస్తాను. పాత్ర ఎక్సయిట్ చేస్తే ఏదైనా చేస్తాను.

డ్రీమ్ డైరెక్టర్స్ ఎవరైనా వున్నారా ?
రాజమౌళి, సుకుమార్, పూరి జగన్నాథ్ ఇలా అందరి దర్శకులతో చేయాలని వుంటుంది. దానికంటే ముందు మంచి కథ చేయాలని వుంటుంది. ఆ కథే నన్ను తీసుకెళ్తుందని భావిస్తా.

కొత్తగా రాబోతున్న చిత్రాలు ?
గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ, రామ్ సేతు విడుదలకు సిద్దంగా వున్నాయి. ఫుల్ బాటిల్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది. ఈశ్వర్ కార్తిక్ దర్సకత్వంలో డాలీ ధనుంజయ తో కలసి ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్న. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

అల్ ది బెస్ట్

థాంక్స్

Advertisement
Author Image