Santosham SouthIndian Film Awards 2023 : యాంకర్ సుమ హోస్ట్ గా గోవా సంతోషం అవార్డుల వేడుక
డిసెంబర్ రెండో తేదీన గోవాలోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరగబోతున్న సంతోషం అవార్డుల వేడుకకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేశారు నిర్వాహకులు. ఇప్పుడు తాజాగా ఈ వేడుకకు యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లుగా ప్రకటించారు సంతోషం అధినేత సురేష్ కొండేటి. ఈ మేరకు సుమ మాట్లాడుతున్న ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నిజానికి సంతోషం అవార్డుల కార్యక్రమం మొదలుపెట్టిన నాటి నుంచి ప్రతి ఏడాది యాంకర్ సుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ గోవాలో వేడుక కూడా ఆమె చేతుల మీదుగానే జరపబోతున్నారు. గోవాలో జరగబోతున్న ఈవెంట్ కి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్లు హాజరు కానున్నారు. గోవాలో జరుగుతున్న ప్రస్తుత ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ ను అనుసరిస్తూ ఈ వేడుక కూడా ఘనంగా జరగబోతోంది.