For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

‘నాయకుడు’ లో ఎమోషన్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది: హీరోయిన్ కీర్తి సురేష్

06:23 PM Jul 14, 2023 IST | Sowmya
Updated At - 06:23 PM Jul 14, 2023 IST
‘నాయకుడు’ లో ఎమోషన్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది  హీరోయిన్ కీర్తి సురేష్
Advertisement

ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మామన్నన్’. మారి సెల్వరాజ్  దర్శకత్వం వహించినఈ చిత్రం తమిళంలో సంచలన విజయం సాధించింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ‘నాయకుడు’ పేరుతో తెలుగులో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూనిక్ ఇంటెన్స్ కంటెంట్ తో అందరినీ అలరించి ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో  కీర్తి సురేష్ విలేకరుల సమవేశంలో 'నాయకుడు' విశేషాలని పంచుకున్నారు.

కీర్తి సురేష్ గారు మీకు డబుల్ కంగ్రాట్స్ .. దసరాతో పాన్ ఇండియా హిట్ కొట్టారు. ఇప్పుడు నాయకుడుతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Advertisement GKSC

థాంక్ యూ సో మచ్ అండీ.

నాయకుడు విజయం ఎలాంటి అనందాన్ని ఇచ్చింది ?

‘మామన్నన్’ తమిళంలో గొప్ప విజయం సాధించింది. ఈ సినిమాలో ఓ కామన్ ఎమోషన్ వుంది. ఆ ఎమోషన్ తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.Nayakudu Has Universal Appeal, Will Connect To The Telugu Audience As Well, Udhayanidhi Stalin,,Latest Telugu Movies,teluguworldnow.com,,Film News,Telugu Golden TVదర్శకుడు ఈ కథ చెప్పినపుడు ఎలా అనిపించింది ?

మారి సెల్వరాజ్  గారి దర్శకత్వంలో పని చేయాలని ప్రతి హీరోయిన్ కు ఆసక్తి వుంటుంది. ఆయన కథలో అమ్మాయిలకు చాలా ప్రాముఖ్యత వుంటుంది. ఆయన కథ చెప్పినపుడు చాలా ఎక్సయిటింగా అనిపించింది. ఐతే ఆయన చెప్పినదాని కంటే నాలుగు రెట్లు ఇంపాక్ట్ ఫుల్ గా సినిమా తీశారు. చిన్నగా మొదలైన గొడవ అది ఎంతకి దారితీస్తుందని చాలా బ్రిలియంట్ గా చూపించారు. ఈ ఎమోషన్ కి ప్రేక్షకుల నుంచి గొప్ప రెస్పాన్స్ రావడం సంతోషాన్ని ఇచ్చింది.

మీ పాత్రకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది కదా.. దర్శకుడు ఈ పాత్ర గురించి చెప్పినపుడు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ?

ఈ చిత్రం నాకు ముందు లుక్ టెస్ట్ చేయలేదు. సింపుల్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ని అద్భుతంగా రాసుకున్నారు దర్శకుడు మారి. మాములుగా జీన్స్ షర్టు షూ వేసుకునే ఓ మామూలు అమ్మాయిని. షూటింగ్ కి  గంట ముందు లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారు.  మీరు గమనిస్తే ఉదయనిధి గారిది , నాది ఒకే డ్రెస్ స్టయిల్ వుంటుంది. ‘నాకు షర్టు లేకపోతే మీ షర్టు వేసుకోవచ్చు కదా అని ఆయనతో సరదా అన్నా (నవ్వుతూ). ఇంటర్వెల్ కొందరు అమ్మాయిలు వచ్చి మీ డ్రెస్సింగ్ బావుందండి అని చెప్పారు. అలా సింపుల్ గా కాజువల్ గా వుండటం వారికి కనెక్ట్  అయ్యింది.Udhayanidhi Stalin, Vadivelu, Fahadh Faasil, Keerthy Suresh’s Maamannan Releasing In Telugu As Nayakudu On July 14th Through Asian Multiplexes Pvt Ltd & Suresh Productions,Film News,teluguworldnow.comఉదయనిధి స్టాలిన్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

ఉదయనిధి స్టాలిన్ గారు చాలా ఫన్ పర్సన్. ఆయనలో చాలా హ్యుమర్ వుంటుంది. సెట్స్ లో చాలా జాలీగా వుంటారు. ఈ సినిమా ఎంత ఇంటెన్స్ గా వుంటుందో దానికి పూర్తి విరుద్ధమైన వ్యక్తిత్వం ఆయనది. చాలా సరదాగా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

వడివేలు గారు ఇందులో సీరియస్ రోల్ చేశారు కదా.. ఆయన్ని అలాంటి పాత్రలో చూడటం మీకు ఎలా అనిపించింది ?

వడివేలు గారు అద్భుతమైన యాక్టర్ . ఆయన ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలి. హాస్యమే కాదు ఇలాంటి సీరియస్ రోల్స్ కూడా ఆయన అద్భుతంగా పండిస్తారు.

రెహమాన్   గారి మ్యూజిక్  గురించి ?

రెహమాన్ గారు ఇచ్చిన ఆర్ఆర్ ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ. థియేటర్ లో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వడివేలు గారికి చేసిన పాట, అలాగే నేను ,ఉదయ్ గారు చేసిన పాట కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. కమ్యూనిజం నేపధ్యంలో వచ్చే పాట, అందులో డ్యాన్స్ ని ప్రేక్షకులు గొప్పగా ఆస్వాదించడం ఆనందాన్ని ఇచ్చింది.

ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ?

తమిళ్ లో సైరన్, రఘు తాత, రివాల్వర్ రీటా చిత్రాలు చేస్తున్నాను. తెలుగులో చిరంజీవి గారి ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

Advertisement
Author Image