For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా ఎదిగింది ? ఆలియా భట్ "గంగూబాయి క‌తియ‌వాడి"

08:47 AM Nov 16, 2021 IST | Sowmya
Updated At - 08:47 AM Nov 16, 2021 IST
film news  ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా ఎదిగింది   ఆలియా భట్  గంగూబాయి క‌తియ‌వాడి
Advertisement

FILM NEWS: ఫిబ్ర‌వ‌రి18న‌ వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ‌వుతున్న ఆలియా భట్ "గంగూబాయి క‌తియ‌వాడి"

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "గంగూబాయి కతియావాడి". బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్‌ జైదీ రచించిన "మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై" అనే బుక్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంజయ్‌ లీలా భన్సాలీ, డా. జ‌యంతిలాల్ గ‌డ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ‌బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.

Advertisement GKSC

ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా ఎదిగింది ? అనేదే సినిమా ప్రధానాంశం. ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా భట్‌ వేశ్య గృహం నడిపే యజమానిగా నటిస్తోంది. ఇప్పటికే పాత్రకు సంబంధించిన పోస్టర్‌, టీజ‌ర్ విడుద‌లై విశేష స్పంద‌న రాబ‌ట్టుకుంది. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 6, 2022న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన మేక‌ర్స్ ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం త‌మ సినిమా రిలీజ్‌డేట్ ను మార్చుకున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 18న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్న‌ట్లు ఈ రోజు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గంగుబాయి టీమ్‌ను ట్విట్ట‌ర్ ద్వారా అభినందించారు.

Gangubai Kathiawadi Movie World Wide Releasing on Feb 18th 2022,Alia Bhatt,Sanjay Leela Bhansali,Hindi Dubbing Movies,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com

Advertisement
Author Image