For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"గంగూభాయ్" క‌థ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది: హీరోయిన్ ఆలియా భట్

09:19 AM Feb 21, 2022 IST | Sowmya
Updated At - 09:19 AM Feb 21, 2022 IST
 గంగూభాయ్  క‌థ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది  హీరోయిన్ ఆలియా భట్
Advertisement

బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన గంగూబాయి కథియావాడి చిత్రంలో ఆలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి 25న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా ఆలియాభ‌ట్ చెప్పిన విశేషాలు..

సంజయ్ స‌ర్ ఈ పాత్రను నాకు ఆఫర్ చేసినపుడు నేను చేయగలనా? అని చాలా భ‌య‌ప‌డ్డాను. నాకు తొమ్మిదేళ్ల వ‌య‌సున్న‌ప్పుడు సంజయ్ స‌ర్ బ్లాక్ సినిమా ఆడిష‌న్స్‌కి వెళ్లాను. ఆయ‌న నన్ను చూసి ఇది హీరోయిన్ క్యారెక్టర్ అని అన్నారు నవ్వుతూ.. అదే గుర్తొచ్చింది. నా భయాన్ని సంజ‌య్ స‌ర్‌ తో షేర్ చేసుకున్నా. దానికి ఆయన అన్నీ నేను చూసుకుంటాను అని అన్నారు. అప్పుడే డిసైడ్ అయ్యాను. ఆయ‌న‌ ఏం చెప్తే అదే చేయాలి అని..Gangubai Kathiawadi Good Movie, Alia Bhat interview, Ajay Devgn,Sanjay Leela Bhansali’s Gangubai Kathiawadi Release On 25th February, telugugolden tv, my mix entertainments, teluguworldnow.comనేను కొంచెం స‌న్న‌గా  ఉంటాను. నా వాయిస్‌లో కూడా అంత బేస్ ఉండ‌దు. దానికోసం గుజ‌రాతీ స్టయిల్ మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేసాను. మంచి ఫుడ్ తిన్నాను. పాత్రకు త‌గ్గ‌ట్టుగా ఈ రెండు మార్చుకోవ‌డం కొంత ఛాలెంజింగ్‌గా అనిపించింది. సంజ‌య్ స‌ర్‌తో సినిమా చేయడం అన్నది నా డ్రీమ్. ఆయన సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా నేను చేస్తాను. ఆయనతో పని చేయడం వన్స్ ఇన్ లైఫ్ టైమ్ అచ్యూవ్ మెంట్‌.

Advertisement GKSC

Advertisement
Author Image