For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: సంతోషం సినిమా నుంచి ఇప్పటికీ ఇలానే ఉంది.. శర్వానంద్

02:22 PM Dec 10, 2021 IST | Sowmya
Updated At - 02:22 PM Dec 10, 2021 IST
film news  సంతోషం సినిమా నుంచి ఇప్పటికీ ఇలానే ఉంది   శర్వానంద్
Advertisement

గమనం సినిమాతో సుజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు.క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ను పెంచారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శర్వానంద్, దేవా కట్టా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో

శర్వానంద్ మాట్లాడుతూ.. ‘బాబా గారి వల్లే నేను ఇక్కడకు వచ్చాను. మా ప్రయాణం మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాతో మొదలైంది. నిర్మాతగ మారతానని చెప్పినప్పుడు అవసరమా? అని అనిపించింది. కానీ కథ విన్నాక ఇదెంతో గొప్పదని తెలిసింది. గమ్యం, ప్రస్థానం, జర్నీ, గమనం అన్నీ కూడా ట్రావెల్ మీదే ఉన్నాయి. ఇళయరాజా గారితో సినిమా చేయాలని అందరికీ ఉంటుంది. శివ ఓ ప్రామిసింగ్ యాక్టర్. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. ప్రియాంక మంచి నటి. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. డిసెంబర్ 10న గమనం రాబోతోంది. అందరూ సినిమాను చూడండి. శ్రియా, నేను ఎంతో కాలం నుంచి ఫ్రెండ్స్. సంతోషం సినిమా నుంచి ఇప్పటికీ ఇలానే ఉంది. మంచి పాత్రలను ఎంచుకంటూ ముందుకు వెళ్తుంది’ అని అన్నారు.

Advertisement GKSC

Gamanam movie will be a great success  Sharvanand, Director Sujana Rao,Heroine Priyanka Jawalkar,Sriya Saran,Shiva kandukuri, telugu golden tv,my mix entertainments, teluguworldnow. com 1

దేవా కట్టా మాట్లాడుతూ.. ‘ప్రస్థానం కలిపిన గమనం అయింది. ఈ సినిమా ఐడియాస్ స్టేజ్ నుంచే నాకు తెలుసు. జ్ఞాన, నేను కలిసి చర్చించుకునేవాళ్లం. ఆప్పుడు కళ్లలో ఎంత ఆనందం కనిపించిందో ఇప్పటికీ అలానే ఉంది. ఇందులోని ప్రతీ ఫ్రేమ్‌లో జీవం కనిపిస్తుంది. శ్రియను జ్ఞాన ఎంతో కన్విన్స్ చేశాడు. మంచి ఐడియా చుట్టూ.. మంచి మనుషులు చేరతారు. ఇది కచ్చితంగా సక్సెస్ అవుతుంది. గమనం అనేది ఓ మెమరబుల్ సినిమా అవుతుంది. ప్రియాంక, శివ ఎంతో అద్బుతంగా నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Advertisement
Author Image