Tollywood News: డిసెంబర్ 10న థియేటర్స్ లో విడుదలవుతున్న "గమనం"
గమనం సినిమాతో సుజనా రావు అనే దర్శకురాలు పరిచయం కాబోతోన్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు.
గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. అయితే పాన్ ఇండియన్‌గా సినిమాగా తెరకెక్కించినప్పటికీ తెలుగు వర్షెన్ మాత్రమే డిసెంబర్ 10న విడుదల కానుంది.
మూడు భిన్న కథలను ఒకే సినిమాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో శ్రియా సరన్ ఓ కథలో అలరించనున్నారు. శివ కందుకూరి ప్రేమకథలో కనిపించనున్నారు. అనాథలు, స్లమ్ ఏరియా నేపథ్యంలో జరిగే కథలో ప్రియాంక జవాల్కర్ నటించారు.
సుజనా రావ్ సున్నితమైన అంశాలను ఎంచుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రతీ ఒక్క కథ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. సాయి మాధవ్ బుర్రా అద్భుతమైన సంభాషణలు అందించగా.. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. జ్ఞానశేఖర్ వి.ఎస్ కెమెరామెన్‌గా వ్యవహరించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే గమనం ట్రైలర్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది.
నటీనటులు : శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్
సాంకేతిక బృందం :
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుజనా రావు
నిర్మాతలు : రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్
సంగీతం : ‘మాస్ట్రో’ ఇళయరాజా
డీఓపీ : జ్ఞానశేఖర్ వి.ఎస్
డైలాగ్స్ : సాయి మాధవ్ బుర్రా
ఎడిటర్ : రామకృష్ణ అర్రమ్