For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ, ప్రయాణం గురించి చెప్పేదే గమనం: శ్రియ స‌ర‌న్‌

09:49 PM Dec 07, 2021 IST | Sowmya
Updated At - 09:49 PM Dec 07, 2021 IST
మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ  ప్రయాణం గురించి చెప్పేదే గమనం  శ్రియ స‌ర‌న్‌
Advertisement

గమనం సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రియా సరన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు

ఇరవై ఏళ్లు ఇలా మీ ముందు ఉన్నాను. మొదట ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా నేను మీ పక్కింటి అమ్మాయిలా మారిపోయాను. మా అమ్మ మ్యాథ్స్ టీచర్. మా నాన్న బీహెచ్‌ఈఎల్‌లో పని చేసేవారు. ఇష్టం నా మొదటి సినిమా. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. నాటి నుంచి నేటి వరకు నాకు ఎంతో ప్రేమ దొరికింది. ప్రేక్షకుల ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. నేను చేసిన కొన్ని సినిమాలు వర్కవుట్ అయ్యాయి. ఇంకొన్ని వర్కవుట్ అవ్వలేదు. ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుక ఎంతో గర్వంగా ఉంది. ఇంకా ఇరవై ఏళ్లు నటిస్తూ ఇలానే ఉండాలని ఉంది.

Advertisement GKSC

కరోనా సమయంలో ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో మంది పనులు లేకుండా అవస్థలు పడ్డారు. ఇప్పుడు సినిమా పరిశ్రమ కోలుకుంటోంది. నేను ఎంత వరకు బతికి ఉంటానో.. అప్పటి వరకు నటిస్తూనే ఉండాలని, సినిమాలు చేస్తూనే ఉండాలని అనుకుంటాను. ఏఎన్నార్ గారు మనం సినిమా టైంలో చివరి క్షణం వరకు నటించారు. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఒకవేళ నేను చనిపోతే.. ఈ సినిమా చేసే చనిపోతాను అని అనేవారు. అలా నేను కూడా చివరి క్షణం వరకు నటిస్తూనే ఉంటాను.

ఇందులో నేను దివ్యాంగురాలి పాత్రలో కనిపిస్తాను. వినిపించదు. కానీ మాట్లాడతాను. ఈ కారెక్టర్ కోసం కొన్ని క్లాసులకు కూడా వెళ్లాను. నిస్సహాయతతో ఉన్న మహిళ సాగించే ప్రయాణమే నా పాత్ర. ఊహకందని ఓ అతీంద్రియ శక్తి ఉందని నమ్మే పాత్రలో కనిపిస్తాను. మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ, ప్రయాణం గురించి చెప్పేదే గమనం. మనల్ని మనం తెలుసుకునేలా చేసే కథ గమనం. నిస్సహాయతతో ఉండే మనిషికి ఒక్కసారిగా బలం వస్తే వాటిని మనం అధిగమించేస్తాం. నా డెలివరీ సమయంలోనూ నాకు ఇలాంటి ఓ భయం ఉండేది. కానీ ఏం కాదు అన్న ధైర్యం నేను తెచ్చుకున్నాను. అంతా సాఫీగానే సాగింది. లైఫ్‌లో అందరికీ అలాంటి ఓ పరిస్థితి వస్తుంది. దాన్నుంచి ఎలా బయటకు వస్తామని చెప్పేదే గమనం.

గమనం సినిమాలో మూడు కథలు ఒకే టైంలో సాగుతాయి. ప్రతీ స్టోరీ ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయి. ప్రకృతి విపత్తులో చిక్కుకుంటారు. వారు ఎలా బయటపడ్డారు అనేదే కథ. ఇది ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా కాదు. ప్రతీ సినిమాతో ఏదో ఒకలా కనెక్ట్ అవుతాం. బట్టలు కుట్టడం నాకు రాదు. కానీ కమల పాత్ర కోసం నేర్చుకున్నాను. మా అమ్మ ఎక్కువగా బట్టలు కుడుతుంది. ఈ పాత్రకు నాకు అస్సలు పోలీక ఉండదు. కానీ ఎమోషన్స్ పరంగా చాలా కనెక్షన్ ఉంటుంది.

Gamanam Movie Story is Good, Heroine Priyanka Jawalkar,Sanjana Rao,Sriya Saran,Shiva kandukuri,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,teluguworldnowప్రెగ్నెన్సీ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగాను నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది. నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోలేను. హిందీలో అయితే డబ్బింగ్ చెప్పుకోగలను. కానీ అంత డేర్ మాత్రం దర్శక నిర్మాతలు చేయరేమో (నవ్వులు). పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. మనకు బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా మా పాపను తీసుకుని వెళ్తున్నాం.

Advertisement
Author Image