For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"బానిసలారా లెండిరా" అంటూ గళమెత్తి కదం తొక్కిన గద్దర్ !

03:50 PM May 11, 2024 IST | Sowmya
UpdateAt: 03:50 PM May 11, 2024 IST
 బానిసలారా లెండిరా  అంటూ గళమెత్తి కదం తొక్కిన గద్దర్
Advertisement

రాజకీయ సంచలనం "అద్దంకి దయాకర్" హీరోగా "బొమ్మకు క్రియేషన్స్" పతాకంపై ప్రొడక్షన్ నంబర్ - 6గా... బహుముఖ ప్రతిభాశాలి డా.మురళి బొమ్మకు "కథ - స్క్రీన్ ప్లే - నిర్మాణం - దర్శకత్వం"లో తెరకెక్కుతున్న ఇంకా పేరు ప్రకటించని చిత్రం నుంచి "బానిసలారా లెండిరా" గీతాన్ని ఆవిష్కరించారు. "సంగీత బాహుబలి" ఎమ్.ఎమ్.కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ గీతానికి "ప్రజాయుద్ధనౌక" గద్దర్ సాహిత్యాన్ని సమకూర్చి గాత్రాన్ని అందించారు. ఈ చిత్రంలో గద్దర్ ఓ ముఖ్య పాత్ర సైతం పోషించడం విశేషం!!

హైదరాబాద్, బోడుప్పల్, ఆర్.ఎన్.ఎస్.కాలనీలో గల "బొమ్మకు ఫిల్మ్ స్టూడియో"లో జరిగిన ఈ ఆడియో వేడుకలో విప్లవ గళం గద్దర్, చిత్ర కథానాయకుడు అద్దంకి దయాకర్, దర్శకనిర్మాత-స్టూడియో అధినేత డా.మురళి బొమ్మకు, రాజకీయ ప్రముఖులు జె.బి.రాజు, మల్లు రవి, మన్వతా రాయ్, బెల్లయ్య నాయక్, చరణ్ కౌశిక్ యాదవ్, శివకుమార్, దుర్గం భాస్కర్, విజయ్ కుమార్, భాస్కర్ రెడ్డి, రమేష్ రాథోడ్, కేతురి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

అద్దంకి దయాకర్, గద్దర్, సుమన్, ఇంద్రజ, సితార, హిమజ, సహస్ర, శుభలేఖ సుధాకర్, మకరంద్ దేశ్ పాండే, రవి ప్రకాష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, సినిమాటోగ్రాఫర్ : జి.ఎల్.బాబు, ఎడిటర్: కార్తీక్ - వెంకట్ ప్రభు - బాబు, మాటలు: భరద్వాజ్ - భూపతి - బాద్షా ఇండియన్, పాటలు: గద్దర్-మౌనశ్రీ మల్లిక్-ఆదేష్ రవి, గానం: గద్దర్-కీరవాణి-ఆదేష్ రవి, కొరియోగ్రఫీ: సుచిత్ర చంద్రబోస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్ కుమార్ బాబు, సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి, కో డైరెక్టర్: కస్తూరి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగులపల్లి కనకదుర్గ, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాణం - దర్శకత్వం: డా.మురళి బొమ్మకు !!

Advertisement
Tags :
Author Image