For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Flowers Used In Pooja దేవుని పూజలో పువ్వులు వాడటం వెనుక ఇంత అర్దం ఉందా.. ఏ దేవుడిని ఏ పూలతో పూజించాలో తెలుసా..!

12:05 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:05 PM May 13, 2024 IST
flowers used in pooja దేవుని పూజలో పువ్వులు వాడటం వెనుక ఇంత అర్దం ఉందా   ఏ దేవుడిని ఏ పూలతో పూజించాలో తెలుసా
Advertisement

పూజ ఏదైనా పువ్వులు వాడటం అనేది తప్పనిసరి. ఒక్కోదేవుని ఒక్కో పువ్వులతో పూజిస్తూ ఉంటాం. నిజానికి దేవుడికి ఎటువంటి మలినం లేని, కల్మషం లేని పువ్వుల్ని ఉపయోగించాలి. చిరిగిన పువ్వులు, విరిగిపోయిన పువ్వులు, ఆకులు రాలిపోయిన, రెక్కలు రాలిపోయినా, సరిగా విచ్చుకొని పువ్వులు మనం ఎట్టి పరిస్థితుల్లోని పూజా కార్యక్రమాల్లో ఉపయోగించరాదు. ఇవి పూజలో ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి.

రేకులు వాడి పోయిన పువ్వులను కూడా పూజ కార్యక్రమాలకు ఉపయోగించరాదు అందుకే పెద్దలు ఏం చెప్తారంటే గులాబీ పువ్వులు రెక్కలు వేరు చేసి వాటిని పూజా కార్యక్రమాల్లో వినియోగించరాదని చెప్తారు. అయితే చామంతి పువ్వులకు ఈ నియమం వర్తించదు. వీటిని రెక్కలను వేరు చేసి దేవుడికి పూజ చేయొచ్చు. వీటి ఒక్కో రెక్క అనేది ఒక్కొక్క పువ్వుతో సమానంగా చెప్తారు. అలాగే పువ్వుల తొడిమలు తీసిన తర్వాతే దేవుడికి అలంకరించాలి.

Advertisement GKSC

దేవుడి పూజలో ఉపయోగించే పూలకు కచ్చితంగా కొన్ని అర్హతలు ఉండి తీరాల్సిందే అందులో వాసన లేని పువ్వులనేవి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు పూజకు పనికిరావు. ఒక్కోదేవుని ఒక్కో రకమైన పువ్వులతో పూజించటం చూస్తూ ఉంటాం. సూర్యభగవానుడ్ని, విఘ్నేశ్వరుని తెల్లజిల్లేడుతో, విష్ణువుని తులసి దళాలతో, శ్రీమహాలక్ష్మిని తామర పువ్వులతో, గాయత్రిదేవిని మందార పువ్వులతో పుజించాలి.

ముళ్ళు ఉన్న పువ్వులను కూడా దేవునికి అలంకరించరాదు.అయితే ముళ్ళ గోరింట పూలకు ముల్లులు ఉన్నప్పటికి వీటిలో తేనె శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ పువ్వులను దేవుడుకి అలంకరించవచ్చు. వీటినే గోబి పువ్వులు అని కూడా అంటారు. ఇవి కృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. వీటిని గొబ్బెమ్మల్లో కూడా ఉపయోగిస్తారు. పూజ ఏదైనా పువ్వులు వాడటం అనేది తప్పనిసరి. ఒక్కోదేవుని ఒక్కో పువ్వులతో పూజిస్తూ ఉంటాం. నిజానికి దేవుడికి ఎటువంటి మలినం లేని, కల్మషం లేని పువ్వుల్ని ఉపయోగించాలి. చిరిగిన పువ్వులు, విరిగిపోయిన పువ్వులు, ఆకులు రాలిపోయిన, రెక్కలు రాలిపోయినా, సరిగా విచ్చుకొని పువ్వులు మనం ఎట్టి పరిస్థితుల్లోని పూజా కార్యక్రమాల్లో ఉపయోగించరాదు. ఇవి పూజలో ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి.

రేకులు వాడి పోయిన పువ్వులను కూడా పూజ కార్యక్రమాలకు ఉపయోగించరాదు అందుకే పెద్దలు ఏం చెప్తారంటే గులాబీ పువ్వులు రెక్కలు వేరు చేసి వాటిని పూజా కార్యక్రమాల్లో వినియోగించరాదని చెప్తారు. అయితే చామంతి పువ్వులకు ఈ నియమం వర్తించదు. వీటిని రెక్కలను వేరు చేసి దేవుడికి పూజ చేయొచ్చు. వీటి ఒక్కో రెక్క అనేది ఒక్కొక్క పువ్వుతో సమానంగా చెప్తారు. అలాగే పువ్వుల తొడిమలు తీసిన తర్వాతే దేవుడికి అలంకరించాలి. దేవుడి పూజలో ఉపయోగించే పూలకు కచ్చితంగా కొన్ని అర్హతలు ఉండి తీరాల్సిందే అందులో వాసన లేని పువ్వులనేవి ఎట్టి పరిస్థితుల్లో దేవుడు పూజకు పనికిరావు..ఒక్కోదేవుని ఒక్కో రకమైన పువ్వులతో పూజించటం చూస్తూ ఉంటాం.

Advertisement
Author Image