For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఫ్యామిలీస్ థియేటర్ కు వచ్చి మెచ్చుకుంటున్నారు - శర్వానంద్

04:26 PM Mar 06, 2022 IST | Sowmya
Updated At - 04:26 PM Mar 06, 2022 IST
ఫ్యామిలీస్ థియేటర్ కు వచ్చి మెచ్చుకుంటున్నారు   శర్వానంద్
Advertisement

శర్వానంద్, రష్మిక మందన్న జంట గా నటించిన సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు.  ఈనెల 4న శుక్రవారం నాడు విడుదలయింది.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై  సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్  ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ... విడుదల రోజు మా అమ్మ నాన్న థియేటర్లో సినిమా చూశారు. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ను వారు వ్యక్తం చేశారు. మన కుటుంబంలోని వ్యక్తులు ఈ సినిమాలోని పాత్రలు ద్వారా మన కళ్ళ ముందు కనిపిస్తారు. నిన్న కొన్ని థియేటర్లకు వెళ్ళాం. అక్కడ అంతా ఫ్యామిలీ తోనే  సినిమా థియేటర్ కు వచ్చి మెచ్చుకుంటున్నారు.

Advertisement GKSC

శర్వానంద్ మాట్లాడుతూ... నా కుటుంబసభ్యులుతోపాటు స్నేహితులు కూడా సినిమా చూసి బాగుందన్నారు.  మనింటిలో జరిగే కథలా వుంటుంది. హ్యాపీగా చాలా రోజుల తర్వాత థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నామని ప్రేక్షకులు చెబుతున్నారని అన్నారు.Families come to the theater and admire Sharwanand, terlugu golden tv, my mix entertainments, teluguworldnow.com 1దర్శకుడు కిషోర్ తిరుమల తెలుపుతూ... ఇంటర్వెల్ లో వున్న ట్విస్ట్కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను ఆదరిస్తున్న మహిళలకు, ప్రేక్షకులకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

Advertisement
Author Image