జహీరాబాద్ ఎంపీ బి.బి పాటిల్ కు ఫేమ్ ఇండియా మ్యాగజైన్ ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డ్ 2021: Fame India Magazine
ఫేమ్ ఇండియా మ్యాగజైన్ వారి ప్రతి సంత్సరం ఉత్తమ పార్లమెంటేరియేన్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది , ఐతే ఈ సారి జహీరాబాద్ తెరాస ఎంపి బి.బి పాటిల్ ను ఫేమ్ ఇండియా మ్యాగజైన్ 2021 సంవత్సరం ఉత్తమ పార్లమెంటీరియన్ గా గుర్తించింది. దేశ వ్యాప్తంగా 25 మంది ఎంపీలు ఎంపిక కాగా తెలుగు రాష్ట్రాల నుండి జహీరాబాద్ ఎంపీ బి.బి పాటిల్ ఒక్కరే ఈ అవార్డు కు ఎంపికయ్యారు. ఈ విషయం తెలంగాణ రాష్టానికి గర్వ కారణం, ఈ సందర్బంగా ఎంపీ బిబి పాటిల్ గారు మాట్లాడుతూ ఉత్తమ పార్లమెంటీరియన్ గా గుర్తించిన ఫేమ్ ఇండియా మ్యాగజైన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. నా మీద నమ్మకంతో నన్ను గెలిపించిన జహీరాబాద్ ప్రజలకు ఇంకా మరిన్ని సేవలు అందిస్తానని తెలియచేసారు, ఈ సందర్బంగా పలువురు తెలంగాణ మంత్రులు బిబి పాటిల్ గారికి శుభాకాంక్షలు తెలియచేసారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఎంపీ బి.బి పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి వేముల ఎంపి బి.బి పాటిల్ ను శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలిపారు.మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు