For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా "ఎఫ్‌3" స‌మ్మ‌ర్ సోగ్గాళ్ళు పోస్ట‌ర్

07:45 PM Mar 02, 2022 IST | Sowmya
Updated At - 07:45 PM Mar 02, 2022 IST
మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా  ఎఫ్‌3  స‌మ్మ‌ర్ సోగ్గాళ్ళు పోస్ట‌ర్
Advertisement

నవ్వుల రైడ్ F2 సినిమాకు సీక్వెల్‌గా F3 మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. అంతా కలిసి గతంలో కంటే రెట్టింపు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవ‌లే చిత్రంలోని 'లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు' సాంగ్ రిలీజ్ చేశారు. దానికి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

తాజాగా మంగ‌ళ‌వారంనాడు మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఎఫ్‌3 -స‌మ్మ‌ర్ సోగ్గాళ్ళు పోస్ట‌ర్ చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. వ‌రేణ్‌తేజ్  స్ట‌యిలిష్‌గా నిలుచొని క‌ళ్ళ‌ద్దాల‌తో స్ట‌యిలిష్‌గా వుంటే అంతే ఎట్రాక్ట్‌గా వెంక‌టేష్ లుక్స్ స‌మ్మ‌ర్ సోగ్గాళ్ళుగా మీ ముందుకు వ‌చ్చేస్తున్నాం అన్న‌ట్లు పోస్ట‌ర్ వుంది. సోష‌ల్ మీడియాలో దీనికి మంచి స్పంద‌న ల‌భిస్తోంది.F3 -Summer Soggallu Poster Adurs on the occasion of Maha Shivratri, telugu golden tv, my mix entertainments, teluguworldnow.com 1రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. మే 27 థియేట‌ర్ల‌లో అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది.

Advertisement GKSC

Advertisement
Author Image