For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Miss Shetty Mr. Polishetty : 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మంచి సినిమా : నిర్మాత దిల్ రాజు

08:07 PM Sep 13, 2023 IST | Sowmya
Updated At - 08:07 PM Sep 13, 2023 IST
miss shetty mr  polishetty    మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి  మంచి సినిమా   నిర్మాత దిల్ రాజు
Advertisement

నవీన్ పొలిశెట్టి. అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల అప్రిషియేషన్స్ తో పాటు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను అభినందించారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఇలాంటి మంచి చిత్రాలను ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని యూవీ క్రియేషన్స్ ఆఫీస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు సినిమాను ప్రశంసించారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారని మరోసారి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో ప్రూవ్ చేశారు. ఈ సినిమా జవాన్ తో పాటు రిలీజైనా స్టడీగా నిలదొక్కుకుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూస్తున్నప్పుడు మంచి ఫీల్ కలిగింది. నవీన్ పోలిశెట్టి తన క్యారెక్టర్ లో నవ్విస్తూనే ఉన్నాడు. అలాగే అనుష్క యాక్టింగ్ తో ఎమోషనల్ చేస్తోంది. సినిమా ఫినిష్ అయ్యేప్పటికి ఒక మంచి సినిమా చూశాననిపించింది. వెంటనే యూవీ వంశీకి, నవీన్ కు ఫోన్ చేశాను. మీరు మంచి సినిమా చేశారు. మౌత్ టాక్ బాగుంది. దీన్ని ప్రజల దగ్గరకు మరింతగా తీసుకెళ్లాలి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టమని నేనే అడిగాను.

Advertisement GKSC

గుడ్ ఫిలింస్ వచ్చినప్పుడు వాటిని మనమంతా ఎంకరేజ్ చేయాలి అనేది నా టార్గెట్. మీరు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలుసు. పాండమిక్ ను ఎదుర్కొన్నారు. అలా మీరు పడిన కష్టమంతా ఈ సక్సెస్ తో మర్చిపోతున్నారు. ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయండి. ఇంకా సినిమా చూడని వాళ్లుంటే వాళ్లు చూసేలా ప్రమోట్ చేసుకోవాలి. మీరు ఎక్కడికి రమ్మన్నా ఈ సినిమా ప్రచారం కోసం వస్తాను. నాలుగు వారాల దాకా ఈ సినిమా స్టడీగా వెళ్తుందనే నమ్మకం ఉంది. ఇవాళ మ్యాట్నీస్ కూడా ఫుల్ అయ్యాయి. మీడియా మిత్రులు కూడా మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తారు. వారికి కూడా థాంక్స్.

యూఎస్ ఆడియెన్స్ కు ఈ సినిమాలోని అడ్వాన్స్ థాట్ నచ్చుతుంది. అందుకే వాళ్లు సండే వరకే వన్ మిలియన్ కలెక్షన్స్ ఇచ్చేశారు. నవీన్ కెరీర్ లో ఇది మూడో వన్ మిలియన్ డాలర్ మూవీ. ఒక కొత్త పాయింట్ ను ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా చెప్పారు. నవీన్ తన క్యారెక్టర్ ద్వారా స్టార్టింగ్ నుంచి నవ్విస్తూ వచ్చాడు. లాస్ట్ 15 మినిట్స్ వరకు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఫిల్మ్ పూర్తయ్యేసరికి ఒక గుడ్ మూవీ చూసిన ఫీల్ కలిగించారు. జవాన్ ను తట్టుకుంటూ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా నిలబడగలిగింది. స్ట్రాంగ్ కలెక్షన్స్ తో ముందుకెళ్తోంది. అన్నారు.

Advertisement
Author Image