For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Events: బంగార్రాజులో ప్ర‌తి సాంగ్ ఓ వజ్రంలా ఉంది : మ్యూజికల్ నైట్ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున

10:19 PM Jan 09, 2022 IST | Sowmya
Updated At - 10:19 PM Jan 09, 2022 IST
tollywood events  బంగార్రాజులో ప్ర‌తి సాంగ్ ఓ వజ్రంలా ఉంది   మ్యూజికల్ నైట్ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున
Advertisement

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు`. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుద‌లకానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం బంగార్రాజు మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

నాగార్జున మాట్లాడుతూ.. ‘అభిమానులందరినీ ఇక్కడకు పిలవలేకపోయాం. అందరూ క్షమించండి. జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోకు అది చాలా ముఖ్యమైన తేది. అదే రోజును అన్నపూర్ణ పుట్టింది. దసరా బుల్లోడు అనే సినిమాతో యాభై ఏళ్ల క్రితం నాన్న గారు సంక్రాంతికి దుమ్ములేపారు. అది కూడా మ్యూజికల్ హిట్. సక్సెస్ మీట్‌లో అందరికీ థ్యాంక్స్ చెబుతాను.

Advertisement GKSC

సినిమాకు సగం సక్సెస్ మ్యూజిక్. ఆ సగం సక్సెస్‌ను అనూప్‌కు ఇస్తున్నాం. చక్కటి మాస్ కమర్షియల్ సాంగ్ ఇచ్చారు. ప్రతీ సాంగ్ ఓ వజ్రంలా ఉంటుంది. సూపర్ హిట్ ఆల్బమ్. లిరిక్ రైటర్స్ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. తెలుగు భాష ఉన్నంత వరకు సాహిత్యం ఉంటుంది. ఎంత ఊహించారో అంతకన్నా ఎక్కువే ఉంటుంది. జనవరి 11న ట్రైలర్ రాబోతోంది. జనవరి 14న పండుగ రోజున పండుగలాంటి సినిమాను తీసుకొస్తున్నాం. అందరూ ఆదరించండి’ అని అన్నారు.

Advertisement
Author Image