For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, కడవెండి ముద్దు బిడ్డ, దొడ్డి కొమరయ్య పై సినిమా

01:55 PM Feb 03, 2022 IST | Sowmya
Updated At - 01:55 PM Feb 03, 2022 IST
film news  తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు  కడవెండి ముద్దు బిడ్డ  దొడ్డి కొమరయ్య పై సినిమా
Advertisement

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, కడవెండి ముద్దు బిడ్డ, దొడ్డి కొమరయ్య పై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ని పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, తదితరులు, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గడీ లో ప్రారంభమైన షూటింగ్, వీఆర్ ఇంటర్నేషనల్.inc పతాకం పై మురళి దర్శకత్వంలో, వీరారెడ్డి... ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి నిర్మాణ సారథ్యంలో నిర్మితమవుతున్న దొడ్డి కొమరయ్య సినిమా.Errabelli Dayakar Rao, who inaugurated the film shooting on the first martyr of Telangana armed struggle, Kadavendi Muddu Bidda, Doddi Komaraiya.,pasham yadagiri,teluguworldnow.comఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమానికి ముందు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది అమరులైనారు. వారిలో దొడ్డి కొమరయ్య మొదటివాడు. కడవెండి లో సంఘం మీటింగ్ జరుగుతుండగా, రజాకార్లు జరిపిన కాల్పుల్లో కొమరయ్య అమరుడు అయినారు. ఆయన పోరాట తత్వం, అలాంటి ఎందరో త్యాగాల స్ఫూర్తి తోనే సీఎం కెసిఆర్ తెలంగాణను సాధించారు. సాధించిన తెలంగాణ ను బంగారు తెలంగాణ చేస్తున్నారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నారు. మనకు, మన ముందు తరాల వారికి ఆనాటి పోరాట యోధుల జీవిత చరిత్రలు తెలియాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మన చరిత్ర, మన సంస్కృతి, మన వైతాళికులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇప్పుడు వాటిని బయటకు తీసే పనిని అనేక మంది నిర్వహిస్తున్నారు. అలా దొడ్డి కొమరయ్య చరిత్ర పై సినిమా తీయడం అభినందనీయం. నిర్మాతలకు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నాను. ఈ సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నాను. అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సినిమా బృందం, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement GKSC
Advertisement
Author Image