For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Viral Video : సాయం చేసిన అమ్మాయికి ఈ ఏనుగు ధన్యవాదాలు చెప్పిన తీరుకు ఫిదా అవుతున్న నటిజెన్లు..

12:40 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:40 PM May 13, 2024 IST
viral video   సాయం చేసిన అమ్మాయికి ఈ ఏనుగు ధన్యవాదాలు చెప్పిన తీరుకు ఫిదా అవుతున్న నటిజెన్లు
Advertisement

Viral Video సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి ఇందులో ముఖ్యంగా పెంపుడు జంతువులు మూగజీవాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రతినిత్యం నెట్ లో వైరల్ గా మారుతున్నాయి అవి చేసే చిలిపి చేష్టలు చూస్తూ ఉంటే ఎలాంటి స్ట్రెస్ లో ఉన్నవారికైనా ఒక్కసారిగా రిలీఫ్ వస్తున్నట్టు అనిపిస్తుంది.. అలాగే తాజాగా ఓ ఏనుగుకు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

సాధారణంగా ఏనుగులు చాలా తెలివైన జంతువులు. మనుషులు చేసే సాయాన్ని వాటి ఎమోషన్స్ ని సరిగ్గా అర్థం చేసుకునే ఏనుగులుకు ఉంటుంది సాధారణంగా అవి ఎప్పుడు మనుషుల జోలికి రావు వాటిపైన ఎవరైనా ఎటాక్ చేస్తేనే వారి మీద దాడి చేస్తాయి... చాలా మంది ఏనుగులను ఇష్టపడుతూ ఉంటారు. గజరాజులకు నచ్చే ఆహారాన్ని పెడుతూ ఉంటారు. ఏనుగు పిల్లలు కూడా చాలా అందంగా, బుజ్జిగా ఉంటాయి. ఏనుగు కనపడితే చాలా మంది వాటి దగ్గరికి వెళ్లి ఫోటోలు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఓ ఏనుగు చిన్న ప్రమాదంలో ఇరుక్కోవడంతో ఒక అమ్మాయి వచ్చి సాయం చేస్తుంది ఆ తర్వాత ఏనుగు చేసి చేసిన పని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు..

Advertisement GKSC

ఈ వీడియోలో ఏముందంటే.. ఒక చెరుకు పొలానికీ, రోడ్డుకీ మధ్య బురదలో ఏనుగు కాళ్లు చిక్కుకుపోయాయి. అది చూసిన ఓ అమ్మాయి ఏనుగు దగ్గరికి వెళ్లి గజరాజు కాళ్ళని బయటకు తీసేందుకు ప్రయత్నించింది. కానీ ఆమెకు అంత బలం లేదు. ఆ ఏనుగు దాడి చేస్తుందేమో అనే భయం లోలోపల ఉన్నా.. మంచి మనసుతో ఆ అమ్మాయి.. ప్రాణాలకు తెగించింది. ఆమె తాలూకు వాళ్లు.. జాగ్రత్త అని చెబుతున్నా.. ఆమె వెనక్కి తగ్గలేదు. తన కోసం ఆమె పడుతున్న శ్రమను ఏనుగు గమనించింది. తను కూడా బురద నుంచి బయటకు వచ్చేందుకు గట్టిగా ప్రయత్నించింది. ఇలా రెండువైపులా జరిగిన ప్రయత్నం ఫలించింది. వెంటనే ఆ ఏనుగు ఆమెకి థాంక్స్ చెబుతున్నట్లుగా.. తొండంతో ఆశీర్వదించింది... ఈ వీడియోని ట్విట్టర్లో షేర్ చేయగా నేటిజన్లో ఫిదా అవుతున్నారు అంతేకాకుండా ఆ అమ్మాయి ధైర్యానికి ఆ ఏనుగు అర్థం చేసుకునే తీరుకి భలే ముచ్చట పడుతున్నారు..

Advertisement
Author Image