For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Eagle Movie Review : ఈగల్ మూవీ క‌థ‌ను ద‌ర్శ‌కుడు చెప్పిన విధానం ఎలా ఉందంటే ? Review by Journalist Audi

04:50 PM Feb 10, 2024 IST | Sowmya
Updated At - 04:50 PM Feb 10, 2024 IST
eagle movie review   ఈగల్ మూవీ క‌థ‌ను ద‌ర్శ‌కుడు చెప్పిన విధానం ఎలా ఉందంటే   review by journalist audi
Advertisement

హైద‌రాబాద్ కృష్ణాన‌గ‌ర్ లో ఒక ఆర్య‌వైశ్య జంట ఉండేది. వీరు ఎక్క‌డో ఖ‌మ్మం నుంచి వ‌చ్చి ఇక్క‌డ త‌మ కుల వ్యాపారమైన కిరాణా షాప్ న‌డుపుతుండేవారు. వీరికి ఇద్ద‌రు కొడుకులు. మొద‌టి కొడుకును అంద‌రు త‌ల్లిదండ్రుల్లాగానే అమెరికా చ‌దువుల కోసం పంపారు. ఆ కుర్రాడు వెళ్లి కొన్నాళ్ల‌యినా కాకుండా.. ఒక ఉప‌ద్ర‌వం. త‌న స్నేహితుడి చేతిలో గ‌న్ అనుకోకుండా పేలి.. హ‌ఠాన్మ‌ర‌ణం. ఈ మ‌ర‌ణ వార్త ఆ పేరెంట్స్ ని, వారి కుటుంబాన్ని ఎంత కుదిపేసిందో చెప్ప‌లేం. దీనంత‌టికి కార‌ణం అమెరికాలో.. అక్క‌డి జ‌నాభాక‌న్నా ఎక్కువ‌గా అందుబాటులో ఉన్న తుపాకులే. దీన్నే వాళ్ల‌క్క‌డ పోష్ గా గ‌న్ క‌ల్చ‌ర్ అంటారు. కానీ అది సృష్టించే విధ్వంసం.. వినాశ‌నం చాలా తీవ్రంగానే ఉంటుందని చెప్ప‌డానికి ఈగ‌ల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.

ఈ ప్ర‌పంచంలో ఏటా వంద కోట్ల తుపాకులు త‌యార‌వుతున్నాయి. ఇవి స‌గానికి స‌గం అసాంఘీక శ‌క్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయ్. ప్ర‌స్తుతం 800 కోట్ల ప్ర‌పంచ జ‌నాభా ఉంటే, 850 కోట్ల తుపాకులున్నాయి. అంటే ఒక త‌ల్లి ఒక్కో బిడ్డ‌ను పుట్టిస్తుంటే.. ఆ బిడ్డ‌ని హ‌త‌మార్చ‌డానికి ఒక గ‌న్ను క‌న్నా ఎక్కువ అందుబాటులో ఉంటోంద‌న్న మాట‌. ఇదీ ఈ సినిమా బేస్ లైన్.. ఇలాంటి అక్ర‌మ ఆయుధ రవాణాను నిలువ‌రించ‌డం ఎలా? అన్న కోణంలో సాగేదే ఈగ‌ల్ అస‌లు క‌థ‌.

Advertisement GKSC

ఓస్ అంతే క‌దా? అనుకోడానికి వీల్లేదు. ఈ క‌థ‌ను ద‌ర్శ‌కుడు ఘ‌ట్ట‌మ‌నేని కార్తిక్ చెప్పిన విధానం ఎలా ఉంటుందంటే.. ఒక గొప్ప ర‌క్ష‌ణ రంగ నిపుణుడు అర్ధంకాని యుద్ధం గురించి ఎంతో విపులంగా విడ‌మ‌ర‌చి చెప్పిన‌ట్టు.. ఒక గొట్టు స‌బ్జెక్ట్ అయిన ఆయుధ ర‌వాణాను అత్యంత తేలిగ్గా విడ‌మ‌రచి చెప్పిన‌ట్టు ఉంటుందీ చిత్రంలో ద‌ర్శ‌కుడు వాడిన స్టోరీ, స్క్రీన్ ప్లై. దాని విజువ‌లైజ్డ్ ప్రెజెంటేష‌న్. మాకు ఆంధ్ర‌జ్యోతి జ‌ర్న‌లిజం కాలేజీలో ఆ పేప‌ర్ మొత్తాన్ని త‌న ఫింగ‌ర్ టిప్స్ మీద న‌డిపే వ‌క్క‌లంక ర‌మ‌ణ‌గారు... ఒక రోజు క్లాస్ తీసుకున్నారు. ఆ క్లాస్ మొత్తం డిఫెన్స్ మీదే సాగింది. డిఫెన్స్ గురించి నేను విన్న అత్యంత డీప్ క్లాస్ అదే. అంత డీటైల్డ్ క్లాస్ కూడా అదే. అంత బ్యూటిఫుల్ నేరేటివ్ క్లాస్ కూడా అదే. స‌రిగ్గా అలాగే ఉందీ స్టోరీ టెల్లింగ్.

ఒక స‌మ‌యంలో ఏంట్రాబాబూ మాకీ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్. ఏదో అర్ధంకాని వ్య‌ర్ధ ప‌దార్ధం మీద ఇంత డిస్క‌ష‌నా? అయినా నేనేమైనా డిటెక్టివ్ క్లాసుల‌కుగానీ అటెండ్ అయ్యానా? అన్న ఆలోచ‌న కూడా వ‌స్తుంది. మ‌ధ్య మ‌ధ్య త‌నే ఒక్కో పాత్ర ద్వారా సేమ్ పాయింట్ డ్రాప్ చేసేస్తుంటాడు కూడా. రెండు మూడు కేరెక్ట‌ర్లు ఇదే ప‌నిగా మ‌న‌కు క‌థ‌ను నూరి పోస్తుంటాయి. అస‌లీ స్టోరీని ఒక లేడీ జ‌ర్న‌లిస్టు పాత్ర ద్వారా తొలుత చెప్పే య‌త్నం చేశాడు. ఆమెతో పాటు ఒక చిన్న కుర్రాడి పాత్ర ద్వారా కూడా తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పిస్తుంటాడు. ఈ ఇద్ద‌రితో పాటు న‌వ‌దీప్ చేసిన జై అనే కేరెక్ట‌ర్ కూడా త‌న‌దైన శైలిలో పోస్ట్ మ్యాన్ పాత్ర పోషిస్తుంటుంది.

ఇక ర‌వితేజ‌లాంటి వాగుడుకాయ చేత ఇంత సొఫెస్టిగేటెడ్ కామ్ అండ్ క‌మిటెడ్ కేరెక్ట‌రైజేష‌న్ పండించ‌డం కూడా చాలా చాలా క‌ష్టం. మాస్ మ‌హారాజ్ గా పేరున్న ర‌వితేజ‌ను ఇంత క్లాస్ గా చూపించిన చిత్రాల్లో దీన్ని ముందు వ‌రుస‌లో నిల‌పాల‌ని కూడా చెప్పాలి. అంత డీసెంట్ గా చేశాడు ర‌వితేజ‌. అదే స‌మ‌యంలో ఈ సినిమా కాన్సెప్టు.. కేజీఎఫ్, స‌లార్ వంటి ప్ర‌త్యేక లోకాలను పోలి ఉంటుంద‌ని అంటున్నారు చాలా మంది. కానీ ఇదేమీ లేనిపోని స‌రికొత్త లోకాల సృష్టి అయితే ఏమీ లేదు. ఉన్న‌దే. ఆ మాట‌కొస్తే స్టోరీ స్టార్టింగ్ లోనే బాక్సైట్ తో మొద‌లు పెడ‌తాడు. ఓర్నాయ‌నో ఇలాంటి సినిమాలు చాలానే వ‌చ్చాయిగా అనుకునే లోపు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ.. చెల‌రేగిపోయాడు ద‌ర్శ‌క\ క‌థ‌కుడు కార్తీక్.

ఈ సినిమాలో మొత్తం రెండు మూడు పాయింట్లున్నాయ్. సందీప్ వంగాలా ఇత‌ను కూడా చాలానే పాయింట్ల‌ను రైజ్ చేసి.. త‌న సినిమా న‌డిపించాడు. మ‌నం గుర్తించాల్సిన విష‌యం ఏంటంటే.. చోటా మోటా ద‌ర్శ‌కులైతే ఒకే పాయింటు, దాని సాగ‌దీత అన్న కోణంలో వ‌ర్క్ చేస్తార‌న్న‌ట్టు. అదే సందీప్, కార్తీక్ లాంటి యంగ్ అండ్ డైన‌మిక్స్ అయితే.. ఒక స్టోరీ కోసం ఎన్నేసి పాయింట్ల‌నైనా.. క‌రివేపాకులా వాడేస్తార‌ని గుర్తించాల‌న్న‌ట్టు. ఈ మూవీలో చూపించిన ల‌వ్ ఎపిసోడ్. ఒక ఎపిక్ అన్న‌ట్టు. నిజంగానే అప్ప‌టి వ‌ర‌కూ డ‌స్టీ డ‌స్టీగా ర‌ఫ్ గా చిత్ర‌ణ చేసిన ద‌ర్శ‌కుడు ఈ ప్రేమ క‌థా స‌న్నివేశాన్ని మాత్రం చాలా చాలా పొయిటిగ్గా అదే స‌మ‌యంలో త‌న‌దైన శైలిలో సస్పెన్స్ గానే న‌డిపించాడు. ఒక తూటా పేలితే భ‌యం క‌లుగుతుంది. నువ్వు పేల్చే తూటా మాత్రం భ‌రోసానిస్తుంది అంటూ ఆమె చెప్పే మాట‌లు బాగా హృద్యంగానూ, ఆలోచింప చేసే విధంగా ఉంటాయ‌న్న‌ట్టు.

అయితే హీరో ప్రేమ- పెళ్లి- పిల్ల‌లు అనే క‌థ‌ను కూడా హాలీవుడ్ రేంజ్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా తీసిన‌ట్టు క‌నిపిఆంచింది. మ‌న తెలుగువాళ్ల‌లో ఇంత టాలెంట్ ఉందా? అనిపిస్తుంది. ఎన్నేసి దేశాల‌ని. పోలెండ్ డెన్మార్క్ ఇలా చాలానే దేశాల‌ను కూర్చున్న చోటు నుంచి క‌ద‌ల‌కుండా చూపించాడు.. ద‌ర్శ‌కుడు. ఇది కూడా ఈ మ‌ధ్య బాగా క‌నిపిస్తోన్న ట్రెండే. జ‌నం చూసిన లొకేష‌నే చూడ్డం లేదు. చాలానే ప్రాంతాల‌ను చూపించి జ‌నాన్ని సీట్ల‌ను క‌ట్టిప‌డేస్తున్నారు.. (నాప‌క్క‌న కూర్చున్న కుర్రాడైతే.. సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి.. ముందుకు వంగి మ‌రీ చూస్తున్న దృశ్యం నా కంట ప‌డింది. అక్క‌డ‌క్క‌డా జ‌నం నవ్వుల రువ్వులు, అరుపులు కేక‌లు సైతం క‌నిపించాయ్).

ఒక్క మాట‌లో చెప్పాలంటే.... ద‌ర్శ‌కుడు తానేదో బాండ్ 007 మూవీని తీస్తున్న‌ట్టు.. క‌ళ్ల‌కు క‌ట్టించ‌డ‌మే కాదు ర‌క్తి క‌ట్టించాడు కూడా. మొద‌ట మొద‌ట ఎంతో డ్రైగా... క‌నిపించినా.. త‌ర్వాత త‌న‌దైన శైలిలో కంట‌త‌డిని ఆపాదించాడు ద‌ర్శ‌క కార్తిక్. మాములుగా ఇలాంటి సినిమాలు ర‌వితేజ‌కు న‌ప్ప‌వు కానీ.. న‌ప్పేలా చేయ‌డంలో డైరెక్ట‌ర్ వ‌ర్క‌వుట్ చేశాడ‌ని మాత్రం చెప్పాలి. ఈగ‌ల్ అమెరిక‌న్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల సింబ‌ల్. ఆ సింబ‌ల్ తో వాళ్లు కూడా తీయ‌లేనంత గొప్ప‌గా సినిమాను తీసినందుకు కార్తిక్ ని.. ఈ మూవీ స్టోరీని ఓకే చేసినందుకు ర‌వితేజ‌ను. ఇంకా ఈ సినిమాలో న‌టించిన వారంద‌రికీ అభినంద‌న‌లు తెల‌ప‌కుండా ఉండ‌లేం.

చివ‌ర్లో త‌న కూతుర్ని ఓ కూతురు పోగొట్టుకున్న ఆఫీసర్ కి త్యాగం చేయ‌టం కూడా చాలా బాగా హృద‌యానికి హ‌త్తుకుంటుంది. మ‌రి చూడాలి.. మూవీని అయితే భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టి హాలీవుడ్ కా బాప్స్ మ‌న ద‌గ్గ‌ర చాలా మందే ఉన్నారోచ్.. అన్న రేంజిలో చూపించారు. రిజ‌ల్ట్ కూడా అదే స్థాయిలో ఉంటే టాలీవుడ్ స్టామినాకు అది చాలా చాల స‌పోర్టివ్ గా ఉంటుంది. ఎనీహౌ కంగ్రాట్& హాట్సాఫ్ కార్తీక్. యూ డిడ్ ఇట్. తెలుగు సినిమాను ఒక ఎత్తున నిల‌బెట్టిన ద‌ర్శ‌కులైన‌.. ఒక ప్ర‌శాంత్ నీల్, మ‌రో సందీప్ వంగా స్థాయిలో నువ్వు కూడా సినిమాలు తీయ‌గ‌ల‌వ‌ని నిరూపించావ్.

Advertisement
Author Image