For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Latest Telugu Movies: #NBK107 ఈ సినిమాలో బాలకృష్ణ, దునియా విజయ్‌ల మ‌ధ్య ఫైట్స్ ఏ రేంజ్ లో ఉండ‌బోతున్నాయి ?

05:37 PM Jan 03, 2022 IST | Sowmya
Updated At - 05:37 PM Jan 03, 2022 IST
latest telugu movies   nbk107 ఈ సినిమాలో బాలకృష్ణ  దునియా విజయ్‌ల మ‌ధ్య ఫైట్స్ ఏ రేంజ్ లో ఉండ‌బోతున్నాయి
Advertisement

మాస్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌ "అఖండ" చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకున్నారు. "క్రాక్" సినిమాతో టాలీవుడ్ కు అద్భుతమైన హిట్‌ని అందించిన సక్సెస్ ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో మూవీ చేస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.  #NBK107 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ఇప్పటికే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు.

మాస్‌ హీరో, మాస్‌ డైరెక్టర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మాస్ ఆడియ‌న్స్ కి ఫుల్‌ మీల్స్ అందించబోతోంది. అంతే కాదు ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర ఉంది. ఆ పాత్ర‌ను ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ చేయ‌నున్నారు. గోపీచంద్ మలినేని తన విలన్‌లను చాలా పవర్‌ఫుల్‌గా చూపించడంలో స్పెషలిస్ట్ కాబట్టి తెలుగులో నటుడికి ఇది సరైన ప్రారంభం అని చెప్ప‌చ్చు. దీంతో ఈ సినిమాలో బాలకృష్ణ, దునియా విజయ్‌ల మ‌ధ్య ఫైట్స్ ఏ రేంజ్ లో ఉండ‌బోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement GKSC

బాలకృష్ణను మునుపెన్నడూ చూడని లుక్‌లో ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు శక్తివంతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. అలాగే ఈ కథ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించారు. గోపీచంద్ మలినేని అన్ని కమర్షియల్ అంశాలు ఉండేలా క‌థ‌ను రెడీ చేస్తుంటారు. అందుకే అతను బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందిస్తున్నాడు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.Duniya Vijay On Board For Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107,Shruti Haasan,,Latest Telugu Movies,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్

సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీత దర్శకుడు: థమన్ ఎస్
డీవోపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
సీయీవో: చిరంజీవి (చెర్రీ)
కో-డైరెక్టర్: కుర్రా రంగారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ-శేఖర్

Advertisement
Author Image