For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

దుల్కర్ సల్మాన్ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ నుంచి హల్లా మచారే పాట

05:45 PM Jul 30, 2023 IST | Sowmya
Updated At - 05:45 PM Jul 30, 2023 IST
దుల్కర్ సల్మాన్ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ నుంచి హల్లా మచారే పాట
Advertisement

దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిలాష్ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా  ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ మ్యూజికల్ జర్నీ ప్రారంభమైయింది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి హల్లా మచారే అనే పాటని విడుదల చేశారు మేకర్స్. ఎనర్జిటిక్ పుట్ ట్యాపింగ్ నెంబర్ గా ఈ పాటని స్వరపరిచారు జేక్స్ బిజోయ్. ఎల్‌వి రేవంత్, సింధూజ శ్రీనివాసన్ ఎనర్జిటిక్ గా  పాడిన పాటకు కృష్ణకాంత్ సాహిత్యం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో దుల్కర్ సల్మాన్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Advertisement GKSC

జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం యూనిక్ కంటెంట్, ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, అనిఖా సురేంద్రన్ వంటి ప్రముఖ తారాగణం ఉంది. చిత్రాన్ని ఈ ఏడాది ఓనం పండుగ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More Articles Read Now  ‘రుద్రమాంబపురం’ సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ ప్రశంశలు…
Betel Leaf For Hair : తమలపాకులోని పోషకాలు జుట్టు పెరుగుదలకి ఎంత గానో ఉపయోగపడుతాయి .. ఎలా వాడాలో మీ కోసం
Sreeleela : “తెలుగు అమ్మాయిలు ఇంకా రావాలి .. బౌండరీల్ని కరెక్ట్ గా సెట్ చేసుకుంటే మనల్ని ఎవరూ ఆపలేరు” అంటున్న శ్రీలీల…
Advertisement
Author Image