FILM NEWS : డ్రింకర్ సాయి హీరో ధర్మ పర్ఫామెన్స్ కు ఆడియన్స్ ఫిదా
Drinker Sai : కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ హీరోగా నటించిన చిత్రం డ్రింకర్ సాయి. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రంలో డ్రింకర్ సాయిగా హీరో ధర్మ నటనకు ప్రేక్షకులు ఫీదా అవుతున్నారు. సినిమా కంటెంట్ తగ్గట్టుగానే హీరో తాగుబోతుగా కనిపించిన తీరు అందరినీ కట్టిపడిస్తోంది. ధర్మ తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. లవ్, ఎమోషన్స్, డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లో ధర్మ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.
సినిమాలో ధర్మ ఇంట్రడక్షనే చాలా మాస్సివ్ గా ఉంది. ఇది మాస్ ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. అలాగే ధర్మ డాన్స్ ఇరగదీశాడు. పాటల్లో అద్భుతమైన డాన్స్ కనబరిచి తీరు.. ఇప్పుడున్న యువ హీరోలలో బెస్ట్ డాన్సర్ ధర్మ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమాలో పాటలు కూడా విజువల్ గా చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఇక ఫ్రీ ఇంటర్వెల్ టైంలో హీరో ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల చేత కాంతారా క్లైమాక్స్ లో వచ్చే అరుపులను గుర్తు చేసింది.
ఇక సెకండాఫ్ లో వచ్చే అనాధాశ్రమంలో పిల్లోడు క్యారెక్టర్ భద్రం క్యారెక్టర్ పండించే నవ్వులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. ఇక పుష్ప ట్రాక్ చాలా బాగా పండింది. సినిమాలో బెస్ట్ సీన్లలో ఇది ఒకటిగా మిగిలిపోతుంది. అలాగే క్లైమాక్స్ కి అద్భుతంగా కనెక్ట్ చేశారు. అలాగే అంబర్ పెట్ శంకర్ అన్న క్యారెక్టర్ ని కూడా చాలా నీట్ గా రాసుకున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్లో మోంటే షార్ట్స్ సీన్స్ చాలా బాగున్నాయి. హీరో పర్ఫామెన్స్ అందరి హృదయాలకు చేరువైంది. ఇక సినిమాలో విజయవాడ విజువల్స్ అద్భుతంగా చూపించారు. అభ్యంతం అలరించిన డ్రింకర్ సాయి చిత్రం క్లైమాక్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని మహిళలను అందరి హృదయాలను కదిలించింది.
హీరో ధర్మ డెబ్యూ సినిమా అయినప్పటికీ 10 సినిమాలు చేసిన అనుభవం ఉన్న నటుడిలా తెరపై అద్భుత ప్రదర్శనను కనబరిచారు. యాక్టింగ్, డాన్సింగ్, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ అలాగే కామెడీ ని కూడా ఇరగదీసాడు. ఇక క్లైమాక్స్ లో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాడు. ఈ సినిమాలో ధర్మ పెర్ఫామెన్స్ చూసిన తర్వాత కచ్చితంగా టాలీవుడ్లో మరిన్ని అద్భుతమైన చిత్రాలు చేస్తారని ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు.