'దొంగలున్నారు జాగ్రత్త' గొప్ప థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే యూనిక్ థ్రిల్లర్ : చిత్ర యూనిట్
డి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్, సునీత తాటి గురు ఫిలింస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం 'దొంగలున్నారు జాగ్రత్త'. యువ హీరో శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
శ్రీసింహ మాట్లాడుతూ.. నా కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి గొప్ప కాన్సెప్ట్ వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. తెలుగులో ఇలాంటి సినిమా ఇంతవరకూ ఎవరూ చేయలేదు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రం కోసం నన్ను ఎంపిక చేసుకున్నందుకు సురేష్ బాబు గారు, సునీత గారు , దర్శకుడు సతీస్ కి కృతజ్ఞతలు. ఇలాంటి సినిమాలకు రచన చాలా బలంగా వుండాలి. సతీష్ గారు అద్భుతంగా రాసి తీశారు. ప్రీతి అస్రాణి పాత్ర చాలా ప్రభావంతగా వుంటుంది.
శ్రీకాంత్ అయ్యంగార్ తన అనుభవాన్ని ఈ కథలో చాలా గొప్పగా యాడ్ చేశారు. సముద్రఖని గారి ప్రజన్స్ తో సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళుతుంది. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ బ్రిలియంట్ వర్క్ చేశారు. రామానాయుడు స్టూడియోలో చాలా అద్భుతమైన సెట్ వేశారు. డీవోపీ యశ్వంత్ గొప్ప కెమరా వర్క్ అందించారు. ఒకే లొకేషన్ చూడడం ప్రేక్షకులకు మొనాటనీ అనిపిస్తుంది కదా అనే ఫీలింగ్ వుండేది. కానీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఆ ఫీలింగే రాలేదు. చాలా బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. సెప్టెంబర్ 23న సినిమా థియేటర్ కి వస్తుంది. అందరూ థియేటర్ కి వెళ్లి చూస్తారని, ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని'' తెలిపారు.
