For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'కాంతార' కన్నా ముందు వచ్చిన 'పింగార' గురించి మీకు తెలుసా ?

12:28 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:28 PM May 13, 2024 IST
 కాంతార  కన్నా ముందు వచ్చిన  పింగార  గురించి మీకు తెలుసా
Advertisement

కన్నడ ప్రాంతీయ అంశంతో రూపొందినప్పటికీ తెలుగు, హిందీ భాషల్లో సైతం వసూళ్ల రికార్డు సృష్టిస్తున్న 'కాంతార' చిత్రాన్ని ప్రేక్షకులంతా ఒకటికి పదిసార్లు చూసి ఆనందిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. అయితే, కన్నడ, తుళు భాషల్లో రూపొందిన 'పింగార' చిత్రం గురించి మీరు విన్నారా? ఈ రెండు చిత్రాల అంశం ఒకటే అయినప్పటికీ కమర్షియల్ అంశాలు లేనందున 'పింగార' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రిషబ్ శెట్టి తన చిన్నతనంలో తన గ్రామంలోని ఒక ఆచారం .. ఆ ఆచారంతో ముడిపడిన కొన్ని సంఘటనలతో ఒక కథను రెడీ చేసుకున్నారు. ఆ కథనే 'కాంతార' సినిమాగా తెరపైకి తీసుకుని వచ్చారు. రచయితగా, దర్శకుడిగా, హీరోగా ఈ మూడు పాత్రలకి ఆయన న్యాయం చేశారు.

వివిధ భాషల్లో ఈ సినిమా రాబడుతున్న వసూళ్లే ప్రేక్షకాదరణకు నిదర్శనం. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, తెలుగులో ఈ నెల 15వ తేదీన గీతా ఆర్ట్స్ వారు విడుదల చేశారు. తెలుగులో రెండు కోట్లకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రం విడుదల హక్కులను పొందారు. నిజానికి ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు తెలుగువారికి పెద్దగా తెలియదు. సినిమాలో ప్రధానమైన అంశంగా కనిపించే ఆచారం గురించి ఇక్కడి వారికి తెలియదు. అయినా కంటెంట్ ను ఆసక్తికరంగా నడిపించడంలో రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యారు.

Advertisement GKSC

కన్నడ 'కాంతార'తో తుళునాడు కళ-సంస్కృతి-ఆచారాలను దేశమంతటికీ పరిచయం చేశారు. ఈ సినిమాని కమర్షియల్ ఫ్రేమ్‌వర్క్‌లో నిర్మించకపోయి వుండకపోతే, ఇది కూడా ఒక్క జాతీయ అవార్డుకే పరిమితమయ్యేది. అయితే నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి అందరికీ రీచ్ ఫార్ములాతో సినిమాను రూపొందించడంలో విజయాన్ని సాధించారు.

అయితే, 'కాంతార' సినిమాతో పోలిస్తే 'పింగార' సినిమాని చాలా నిజాయితీగా రూపొందించారంటారు.
ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిస్థితులను ఉన్నది ఉన్నట్టు ఎంతో రియలిస్టిక్ గా తీశారు. ఆ సినిమాలో కమర్షియల్ హంగులు లేని కారణంగా పింగారా సినిమాకు పెద్ద గుర్తింపు రాలేదు. ఈ సినిమా విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంది.. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ సినిమా అవార్డు కూడా వచ్చింది. ఎన్నో ఫిలింఫెస్టివెల్‌కు కూడా ఈ సినిమా వెళ్ళింది.

Advertisement
Author Image