For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: సందీప్ కిషన్ పాన్ ఇండియన్ "మైఖెల్" చిత్రంలో హీరోయిన్‌గా దివ్యాంక కౌశిక్

11:24 AM Dec 19, 2021 IST | Sowmya
Updated At - 11:24 AM Dec 19, 2021 IST
film news  సందీప్ కిషన్ పాన్ ఇండియన్  మైఖెల్  చిత్రంలో హీరోయిన్‌గా దివ్యాంక కౌశిక్
Advertisement

సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రాబోతోన్న మైఖెల్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్టైన్ చిత్రాన్ని రంజిత్ జయకోడి తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

ఈ మధ్యే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలోని ప్రతీ పాత్రకు ఓ ప్రాముఖ్యత ఉంది. స్టార్ డైరెక్టర్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి, ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీస్‌లో నటించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు.

Advertisement GKSC

తాజాగా మేకర్లు ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను రివీల్ చేశారు. మజిలి సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న దివ్యాంక కౌశిక్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం దివ్యాంక కౌశిక్‌ను దర్శకనిర్మాతలు తీసుకున్నారు.

Divyansha Kaushik On Board For Sundeep Kishan,Vijay Sethupathi,Ranjit Jeyakodi,Pan India Film Michael,telugu golden tv,my mix entertainments,teluguworldnow.com.1

సాంకేతిక బృందం :

దర్శకత్వం : రంజిత్ జయకోడి
నిర్మాతలు : భరత్ చౌదరి, పుస్కర్ రామ్ మోహన్ రావు
సమర్పణ : నారాయణ్ దాస్ కే నారంగ్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శివ చెర్రీ
పీఆర్వో : వంశీ-శేఖర్

Advertisement
Author Image