For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: "పంచతంత్రం"లో దేవిగా దివ్య శ్రీపాద... ఆమె పుట్టినరోజు ఫస్ట్ లుక్ విడుదల

06:42 PM Sep 05, 2021 IST | Sowmya
Updated At - 06:42 PM Sep 05, 2021 IST
film news   పంచతంత్రం లో దేవిగా దివ్య శ్రీపాద    ఆమె పుట్టినరోజు ఫస్ట్ లుక్ విడుదల
Advertisement

Divya Sripada as Devi in Panchatantra Movie, Panchatantram Movie First Look, Harsha Pulipaka, Latest Telugu Movies, FILM News Telugu World Now,

FILM NEWS: పంచతంత్రం'లో దేవిగా దివ్య శ్రీపాద... ఆమె పుట్టినరోజు ఫస్ట్ లుక్ విడుదల

Advertisement GKSC

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. ఆదివారం (సెప్టెంబర్ 5) దివ్య శ్రీపాద పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దేవి పాత్రలో దివ్య శ్రీపాద నటిస్తున్నారని దర్శక-నిర్మాతలు తెలిపారు.

ఈ సందర్భంగా 'పంచతంత్రం'తో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ "మా సినిమాలో... కొత్తగా పెళ్లై సాధారణ మధ్య తరగతి కుటుంబంలోకి అడుగుపెట్టిన దేవి పాత్రలో దివ్య కనిపిస్తారు. సినిమాల్లో అన్ని క్యారెక్టర్లను అందంగా, ఆసక్తికరంగా రాసుకున్నాం. అన్నిటి కంటే దేవి పాత్ర చాలా ప్రత్యేకం. చాలా సదాసీదాగా, అమాయకంగా కనిపించే దేవి... ఇంటికి, తనకు కష్టం వచ్చినప్పుడు కుటుంబం కోసం పోరాడే క్రమంలో ఆమె ధైర్యం కనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలు మోసే పాతికేళ్ల ప్రతి ఆడపిల్ల దేవి పాత్రలో తమను తాము చూసుకుంటారు" అని చెప్పారు.

ఈ సందర్భంగా నిర్మాత సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ "మా దేవి... దివ్య శ్రీపాద కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమాలో కీలకమైన పాత్రలో ఆమె నటించారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 75 శాతం పూర్తయింది. ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్ లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం" అని అన్నారు.

నటీనటులు:
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, దివ్య శ్రీపాద వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ ‌ తదితరులు.

సాంకేతిక వర్గం:
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌ – ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా), అసోసియేట్ డైరెక్టర్: విక్రమ్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అయేషా మరియమ్‌, ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌, సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సాయి బాబు వాసిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌ సాలూరు, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి, మాటలు: హర్ష పులిపాక, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి, నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు, రైటర్‌–డైరెక్టర్‌: హర్ష పులిపాక.

Divya Sripada as Devi in Panchatantra Movie, Panchatantram Movie First Look, Harsha Pulipaka, Latest Telugu Movies, FILM News Telugu World Now,

Advertisement
Author Image