For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: పుష్ప సినిమా క‌థ రాసింది సుకుమార్ కాదా? అస‌లు క‌థ ఎవ‌రిది ?

02:58 PM Dec 24, 2021 IST | Sowmya
Updated At - 02:58 PM Dec 24, 2021 IST
film news  పుష్ప సినిమా క‌థ రాసింది సుకుమార్ కాదా  అస‌లు క‌థ ఎవ‌రిది
Advertisement

పుష్ప సినిమా క‌థ రాసింది సుకుమార్ కాదా? అస‌లు క‌థ ఎవ‌రిది ? ఆరేళ్ల ప‌రిశోధ‌న అని చెబుతున్న సుకుమార్, ఆ ప‌రిశోద‌న మొత్తం వేరొక‌రిది వాడేశారా?  ఇంత‌కీ సుకుమార్ క‌థ ఆలోచ‌న ఎవ‌రిది? అస‌లు క‌థ ఎవ‌రిది- ఇందులో సుకుమార్ ది కేవ‌లం కొస‌రేనా? అందుకే ఆ సినిమా గ‌త సినిమాల‌క‌న్నా భిన్నంగా చీప్ రేటెడ్ గా వ‌చ్చిందా? క‌థా సంగ్ర‌హం కాజేశాన‌న్న అప‌రాథ భావం కొద్దీ సుకుమార్ పుష్ప‌ను చెడ‌గొట్టేశారా? అంటే అవును అనే స‌మాధానం వినిపిస్తోంది..

ఈ క‌థాలోచ‌న సుకుమార్ కి ఉన్న మాట వాస్త‌వ‌మే కానీ.. అయితే దానికో రూపూ- షేపూ తొలిగా చూపించింది మాత్రం ఆది అనే ఒకానొక ఘోస్ట్ రైట‌ర్ ఆది నారాయణ గా తెలుస్తోంది.. రంగ‌స్థ‌లం మీద రివ్యూ రాసిన స‌ద‌రు ఘోస్ట్ రైట‌ర్ ను సుకుమార్ పిలిపించి మాట్లాడాడ‌నీ.. ఈ క్ర‌మంలో అత‌డ్ని సుకుమార్ కేజీఎఫ్ రేంజ్ బ్యాగ్రౌండ్ ఉంటే చెప్ప‌మ‌న్నాడ‌నీ.. అందుకా ఔత్సాహికుడు..త‌న ద‌గ్గ‌రున్న రెండు లైన్ల‌లో ఒక లైన్ పంపించ‌డం మాత్ర‌మే కాక‌.. ఆయ‌న‌తో నేరుగా ఎర్ర చంద‌నం బ్యాగ్రౌండ్ అయితే బావుంటుంద‌ని చెప్పాడ‌నీ.. ఇది విన్న సుకుమార్.. త‌న‌కు కూడా రెడ్ శాండ‌ల్ పై బ్యాగ్రౌండ్ లో సినిమా తీయాల‌న్న ఆలోచ‌న ఉంద‌నీ.. అయితే ఈ లైన్ ఇంకెక్క‌డా చెప్పొద్ద‌ని.. ఆ ఔత్సాహిక ర‌చ‌యిత‌తో అన్నాడ‌నీ బాధిత ర‌చ‌యిత ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెబుతున్న దాన్ని బ‌ట్టీ తెలుస్తోంది.. అంతే కాదు మ‌ధ్య మ‌ధ్య సుకుమార్ కు డాటా వాట్స‌ప్ చేశాడ‌నీ రెండో సారి వెళ్లిన‌పుడు హార్డ్ కాపీల‌ను సైతం అందించాడ‌నీ.. అయినా స‌రే ఆ ర‌చ‌యిత‌కు త‌గిన‌ పారితోష‌కం ఇవ్వ‌క పోవ‌డ‌మే కాకుండా క‌నీస గౌర‌వం ఇవ్వ‌లేద‌నీ.. పైపెచ్చు అత‌డ్ని త‌న స‌హాయ‌క బృందం ద్వారా తెలివిగా త‌ప్పించాడ‌నీ వాపోతున్నాడా ర‌చ‌యిత‌ ఆది నారాయణ..

Advertisement GKSC

https://youtu.be/kbqPcEzhOls

ఇపుడీ దే టాలీవుడ్ లో అతి పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది..అయితే క్రియేటివ్ డైరెక్ట‌ర్ గా పేరున్న సుకుమార్ త‌న పేరిట రైటింగ్స్ అని కూడా పెట్టుకున్న సుకుమార్ క‌థా ఆలోచ‌న‌ల్ని ఇలా ఇత‌రుల నుంచి సంగ్ర‌హిస్తాడా? ఆ త‌ర్వాత ఇలాంటి అమాయ‌కుల‌కు మొండి చేయి చూపిస్తాడా? సుకుమార్ కాంపౌండ్ లో అస‌లేం జ‌రుగుతోంది ???

https://youtu.be/-91oDAWgHCk

Director Sukumar Pushpa Movie Story Belongs To Sr journalist Adi Narayana,Allu Arjun,Rashmika Mandanna,telugu golden tv tv,my mix entertainments,teluguworldnow.com.1

Advertisement
Author Image