For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

SJ Surya : మహేష్ బాబు అలా అనడంతో ఇంకా ఎక్కువ బాధపడ్డాను : ఎస్.జె. సూర్య

12:40 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:40 PM May 13, 2024 IST
sj surya   మహేష్ బాబు అలా అనడంతో ఇంకా ఎక్కువ బాధపడ్డాను   ఎస్ జె  సూర్య
Advertisement

SJ Surya : దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎస్.జె. సూర్య ఆ తర్వాత నటుడిగా మరి సినిమాలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సూర్య ఖుషి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే మహేష్ బాబూతో నాని సినిమా చేశారు. ఆతర్వాత మహేష్ నటించిన స్పైడర్ సినిమాలో విలన్ గా నటించి భయపెట్టారు ఎస్.జె. సూర్య. కాగా ఎస్‌జే సూర్య తాజాగా నటించిన చిత్రం ‘వదంతి’. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్య... నాని సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాని సినిమా విషయంలో ఎప్పటి నుంచో ఓ బాధ మిగిలిపోయిందన్న సూర్య... తాను పెద్ద హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చానని, కానీ దర్శకుడిని అయ్యానని చెప్పుకొచ్చారు. ప్రతీ సినిమాను ప్రేమ తోనే చేస్తామని, శక్తినంతా ధారపోస్తామని కానీ నాని చిత్రంలో తప్పు జరిగిందని గుర్తు చేసుకున్నారు. నాని సినిమా విడుదల తర్వాత ఓసారి మహేష్‌ మాట్లాడుతూ... మీరు ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఫలితాన్ని పక్కన పెడితే మిమ్మల్ని, మీ పనితనాన్ని ఇష్టపడుతున్నా అని తెలిపారన్నారు.

Advertisement GKSC

అయితే మహేష్‌ అలా అనడం తనను మరింత బాధించిందనన్న సూర్య... మహేష్‌ బాబుకు హిట్ ఇవ్వలేకపోవడం బాధగా ఉందన్నారు. ప్రస్తుతం తాను యాక్టింగ్‌లో బిజీగా ఉన్నానని... మళ్ళీ దర్శకత్వం చేస్తానని తెలిపారు. అప్పుడు మహేష్‌తో ఖచ్చితంగా సినిమా చేస్తానని తెలిపారు.

Advertisement
Author Image