For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Rajamouli : మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న దర్శక ధీరుడు రాజమౌళి..!

12:39 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:39 PM May 13, 2024 IST
rajamouli   మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న దర్శక ధీరుడు రాజమౌళి
Advertisement

Rajamouli : స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని దక్కించుకొని తానెంటో నిరూపించుకున్నాడు జక్కన్న. ఆ తర్వాత నుంచి ప్రతి సినిమాతో సక్సెస్ ను అందుకుంటూ సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు జక్కన్న. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు రాజమౌళి. బాహుబలి సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాడు జక్కన్న.

ఇక ఆయన లేటెస్ట్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్ తో హాలీవుడ్ దర్శకులను కూడా మెప్పించారు. కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది ఆర్ఆర్ఆర్. ఇక మొన్నటి వరకు జపాన్‏లో సందడి చేసిన రాజమౌళి.. ఇప్పుడు గత కొద్ది రోజులుగా అమెరికాలో ఉంటూ ఆర్ఆర్ఆర్ సినిమాను మరింత ప్రమోట్ చేస్తూ అక్కడి ఫిలిం ఫెస్టివల్స్‏లో పాల్గొంటున్నాడు. అక్కడ కూడా జక్కన్నకు భారీ గానే ఫాలోయింగ్ పెరిగిపోయింది. తాజాగా రాజమౌళికి మరో అరుదైన గౌరవం లభించింది.

Advertisement GKSC

అమెరికా లోని లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రికలో రాజమౌళి గురించి ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ రాశారు. ఈ పత్రిక లోని ముందు పేజీ అంతా పూర్తిగా రాజమౌళి ఆర్టికల్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఒక తెలుగు దర్శకుడి గురించి అమెరికా లోని ప్రముఖ పత్రికలో మొదటి పేజిలో రావడం సినీ ప్రముఖులందరికీ గర్వకారణం అనే చెప్పాలి. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.

Advertisement
Author Image