For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Director Rajamouli : సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రాజమౌళి ఎమోషనల్ పోస్ట్.. ఆస్కార్ గురించి ఏమన్నాడంటే?

08:56 PM Jan 25, 2023 IST | Sowmya
Updated At - 08:56 PM Jan 25, 2023 IST
director rajamouli   సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రాజమౌళి ఎమోషనల్ పోస్ట్   ఆస్కార్ గురించి ఏమన్నాడంటే
Advertisement

Director Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం "ఆర్‌ఆర్‌ఆర్‌". ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. కాగా తాజాగా ఈ సినిమా లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ విషయంపై రాజమౌళి తాజాగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జక్కన్న ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ పోస్ట్ లో..

Advertisement GKSC

నా సినిమాలో పాటకు మా పెద్దన్న ఆస్కార్ నామినేషన్ పొందారు. ఇంతకంటే ఇంకేం కావాలి? అలుపెరగకుండా, పని రాక్షసుడిలా వ్యవహరించిన కార్తికేయ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నీ పట్ల గర్విస్తున్నాను కార్తికేయ. ఇప్పుడు నేను తారక్, చరణ్‌ల కంటే ఫాస్ట్‌గా నాటు నాటు పాటకు డ్యాన్స్‌ చేస్తున్నా. చంద్రబోస్ గారూ కంగ్రాచ్యులేషన్స్.. ఆస్కార్ వేదిక మీద మన పాట వినిపిస్తోంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. ఈ పాట కోసం మీ కృషి అమూల్యం. మీకు నా వ్యక్తిగత ఆస్కార్ ఇచ్చేస్తాను. ఈ పాటకు సంబంధించి నాకు భైరవ బీజీఎం ఎంతో భరోసా అందించింది. ఈ పాట ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణంఎన్టీఆర్, రామ్ చరణ్ తమదైన శైలిలో వారు చేసిన డ్యాన్స్. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకింది.

అయితే, ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ వేళ నేను పెట్టిన టార్చర్‌కు వారిద్దరినీ క్షమాపణలు కోరుతున్నా. చాన్స్ దొరికితే వాళ్లిద్దరినీ మరోసారి ఆడుకోవడానికి నేను రెడీ. అసలు నేనెప్పుడూ ఆస్కార్ వరకు వెళతానని అనుకోలేదు. నాటు నాటు పాటకు, ఆర్ఆర్ఆర్‌కు ఉన్న అభిమానుల వల్లే సాధ్యమైంది. వారి అభిమానం చూసిన తర్వాత ఈ పాటను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మా మనసుల్లో కలిగింది. వీరాభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఇక సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్, నాటు నాటు పాటకు ప్రచారం కల్పించడంలో నిరంతరం కృషి చేసిన ప్రదీప్, హర్ష, చైతన్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆస్కార్‌కు మరొక్క అడుగుదూరంలో ఉన్నాం.. థాంక్యూ!’ అంటూ రాజమౌళి ఎమోషనల్‌ అయ్యారు.

Advertisement
Author Image