For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

హీరో ఆది సాయికుమార్‌ కు జోడీ గా "దిగంగన సూర్యవంశీ"

06:59 PM Mar 11, 2022 IST | Sowmya
Updated At - 06:59 PM Mar 11, 2022 IST
హీరో ఆది సాయికుమార్‌ కు జోడీ గా  దిగంగన సూర్యవంశీ
Advertisement

ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ ప్రస్తుతం టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో ఒక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్‌లో 10వ‌ చిత్ర‌మిది. ఫణి కృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

కాగా,  ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన కథానాయికగా నటించడానికి నటి దిగంగనా సూర్యవంశీని ఖ‌రారు చేశారు. తెలుగు, హిందీ భాషలలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో న‌టిస్తున్న దిగంగన ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమాలో న‌టించ‌డం ప‌ట్ల చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతోంది.Digangana Suryavanshi For Sri Sathya Sai Arts’ Production No 10 With Aadi Saikumar directed by debutant Phani Krishna Siriki, telugu golden tv, my mix entertainments, teluguworldnow.com 1నటీనటులు : ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశీ

Advertisement GKSC

సాంకేతిక సిబ్బంది : సమర్పకులు : లక్ష్మీ రాధామోహన్, ప్రొడక్షన్ బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్, నిర్మాత: కేకే రాధామోహన్,,రచయిత, దర్శకుడు: ఫణి కృష్ణ సిరికి, సంగీతం: RR ధ్రువన్, డిఓపి: సతీష్ ముత్యాల, కళ: కొలికపోగు రమేష్, ఎడిటర్: గిడుతూరి సత్య, యాక్షన్: రామ కృష్ణ, కొరియోగ్రఫీ: జిత్తు, ప్రొడక్షన్ కంట్రోలర్: MS కుమార్,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం శ్రీనివాసరావు (గడ్డం శ్రీను), PRO: వంశీ-శేఖర్, రూపకర్త: రమేష్ కొత్తపల్లి.

Advertisement
Author Image