For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

#CaptainMiller ఒక స్కెచ్ డ్రాయింగ్ లో 1930-40 నాటి షిప్ ని చూపిస్తూ ?

03:13 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:13 PM May 11, 2024 IST
 captainmiller ఒక స్కెచ్ డ్రాయింగ్ లో 1930 40 నాటి షిప్ ని చూపిస్తూ
Advertisement

ధనుష్, అరుణ్ మాథేశ్వరన్, టి.జి. త్యాగరాజన్, సత్యజ్యోతి ఫిల్మ్స్ భారీ చిత్రం 'కెప్టెన్ మిల్లర్' ప్రకటన
నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్, విలక్షణ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్‌ కలయికలో ఓ భారీ పీరియాడికల్ చిత్రం రూపొందనుంది. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందనుంది. సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై టి జి త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో చాలా ఆసక్తికరంగా వుంది. ఒక స్కెచ్ డ్రాయింగ్ లో 1930-40నాటి షిప్ ని చూపిస్తూ కథానాయకుడి పాత్ర ముఖం కనిపించకుండా స్కార్ఫ్ ని చుట్టుకొని ఒక వింటేజ్ బైక్ నడుపుకుంటూ రావడం, తర్వాత టైటిల్ రివిల్ కావడం ఎక్సయిటింగా వుంది. వీడియోలో వినిపించిన నేపధ్య సంగీతం అవుట్ స్టాండింగా వుంది. ఈ చిత్రం భారీ పీరియాడికల్ మూవీగా వుండబోతుందని ఈ వీడియోని చూస్తే అర్ధమౌతుంది.

Advertisement GKSC

దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలను తెరకెక్కించగా, సత్యజ్యోతి ఫిలింస్ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన బెంచ్‌మార్క్‌ను సృష్టించింది. 'కెప్టెన్ మిల్లర్' అధికారిక ప్రకటనకు ముందే భారీ సంచలనం సృష్టించింది. సత్యజ్యోతి ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవంగా అందించే దిశగా ఎక్కడా రాజీలేకుండా పని చేస్తుంది. ప్రాజెక్ట్ ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి చిత్ర యూనిట్ ఏడాది పాటు విస్తృతమైన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేసింది.

బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ సినిమా తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ అందిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫర్ గా , నాగూరన్ ఎడిటర్ గా,  టి.రామలింగం ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

సత్యజ్యోతి ఫిలింస్, నిర్మాత టి.జి. త్యాగరాజన్ మాట్లాడుతూ... “మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కెప్టెన్ మిల్లర్’ ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇది మా ప్రొడక్షన్ హౌస్ నుండి భారీ స్థాయిలో రూపొందిన ప్రామిసింగ్ మూవీలలో ఒకటిగా ఉంటుందని బలంగా నమ్ముతున్నాను. ఐకాన్ స్టార్ ధనుష్‌తో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది. మేము గతంలో కలసి చేసిన చిత్రాలు విజయవంతమయ్యాయి. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ నాకు, ధనుష్‌కి స్క్రిప్ట్‌ను చెప్పినపుడు , మేమిద్దరం ఎగ్జైట్ అయ్యాము, భారీ స్థాయిలో రూపొదించాలని భావించాం. దర్శకుడు అరుణ్ అసాధారణమైన ఆలోచనలతో విలక్షణ ఫిల్మ్ మేకింగ్ మెథడాలజీలతో అసాధారణమైనవి చిత్రాలు అందిస్తుండటం ప్రసంశనీయం. దర్శకుడు స్క్రిప్ట్‌ను వివరించినప్పుడు, అతని ఆలోచన, అతని అద్భుతమైన స్క్రీన్‌ రైటింగ్‌ నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి జివి ప్రకాష్‌ సంగీతం మరో అదనపు ఆకర్షణ. ఈ చిత్రం కోసం పని చేస్తున్న అత్యున్నత స్థాయి నటులు, సాంకేతిక నిపుణులతో  'కెప్టెన్ మిల్లర్'ని మరింత గొప్ప స్థాయికి వెళుతుంది'' అన్నారు. కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

తారాగణం: ధనుష్
సాంకేతిక విభాగం :
రచయిత, దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
నిర్మాతలు: జి. శరవణన్ , సాయి సిద్ధార్థ్
సమర్పణ: టీజీ  త్యాగరాజన్
బ్యానర్: సత్యజ్యోతి ఫిల్మ్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: శ్రేయాస్ కృష్ణ
ఎడిటర్: నాగూరన్
ఆర్ట్: టి.రామలింగం
పీఆర్వో: వంశీ-శేఖర్Dhanush, Arun Matheswaran, T.G. Thyagarajan, Sathya Jyothi Films ‘Captain Miller’ Announced,Tamil Movies,telugu golden tv,my mix entertainements,www.teluguworldnow.com

Advertisement
Author Image