For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ధమాకాని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు : మాస్ మహారాజా రవితేజ ఇంటర్వ్యూ

12:42 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:42 PM May 13, 2024 IST
ధమాకాని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు   మాస్ మహారాజా రవితేజ ఇంటర్వ్యూ
Advertisement

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధమాకా'. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న 'ధమాకా' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో హీరో రవితేజ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

ధమాకా ప్రమోషన్స్ లో కొత్తగా కనిపిస్తున్నారు.. ఫ్యాన్ మీట్ జరిగింది కదా ?

Advertisement GKSC

ఫ్యాన్స్ తో కలవడం జరుగుతూనే వుంటుంది. ఫ్యాన్ మీట్ ని చాలా ఎంజాయ్ చేశాను. అన్ని చోట్ల పాజిటివ్ గా వుంది. ఆ పాజిటివిటీనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది.

ఏ సినిమా ప్రమోష‌న్లలోనూ సినిమా గురించి పెద్దగా మాట్లాడ‌రు.. హైప్ ఇవ్వరు కదా ?

ఇప్పుడే కాదండీ.. మొదటి నుండి నేనింతే. మనం మాట్లాడకూడదు.. సినిమానే మాట్లాడుతుంది. సినిమా విడుదలైన తర్వాత ఆటోమేటిక్ గా సినిమానే మాట్లాడుతుంది కదా.

Mass Maharaja Ravi Teja’s First Look And Teaser From Mega Star Chiranjeevi, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya Unveiled,Telugu Golden TV,My Mix Entertainments,www.teluguworldnow.comధమాకా ఎలాంటి సినిమా ?

ధమాకా మంచి ఎంటర్ టైనర్. రాజా ది గ్రేట్ తర్వాత అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ చేయలేదు. ధమాకా ఫుల్ ఎంటర్ టైనర్. జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు.

ఈ మధ్య మీ నుండి సీరియస్ సినిమాలు వచ్చాయి కదా ? అటు వైపు వెళ్ళడానికి కారణం ?

అన్నీ ప్రయత్నించాలి కదా. ఫలితం మాట పక్కన పెడితే ప్రయత్నం జరుగుతూనే వుండాలి.

ధమాకాని రౌడీ అల్లుడు తో పోలుస్తున్నారు ?

మా రచయిత ఈ మాట చెప్పి వుంటారు. తెలుగు లో ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు మొదలుపెట్టింది చిరంజీవి గారు. తర్వాత మేమంతా ఫాలో అయ్యాం.  ధమాకా, రౌడీ అల్లుడు లాంటి ఎంటర్ టైన్ మెంట్ సినిమానే. అందులో ఎలాంటి సందేహం లేదు.

ఈ మధ్య కొత్త రచయితలతో ఎక్కువ పని చేస్తున్నారు కదా  ? 

ఈ మధ్య కాదు. ఎప్పటి నుండో వుంది. నాకు కొత్త రచయితలతో పని చేయడం ఇష్టం. వాళ్ళలో ఒక ఆకలి, తపన వుంటుంది. నేను అలా వచ్చినవాడినే కదా.

Du Du Song from Mass Maharaja Ravi Teja, Srileela, Trinadha Rao Nakkina, TG Vishwaprasad Dhamaka Releases November 25,Telugu Golden TV,telugu world news,my mix et,www.teluguworldnow.comమీ ఎనర్జీ భీమ్స్ కి ఇచ్చినట్లు వున్నారు ?

రెచ్చిపోతున్నాడు. (నవ్వుతూ) ధమాకా ఆల్బమ్ ఇరగదీశాడు. తను చాలా మంచి ట్యూన్ మేకర్. ధమాకా సౌండ్ అదిరిపోయింది. అన్నీ పాటలు అద్భుతంగా చేశాడు.

దర్శకుడు త్రినాధరావు నక్కిన గురించి ?

త్రినాథరావు నక్కినతో చాలా సరదాసరదాగా వుంటుంది. తనతో పని చేయడం అందరికీ కంఫర్ట్ బుల్ గా వుంటుంది.

త్రినాథ‌రావు మీ అభిమాని క‌దా..? ఫ్యాన్ డైరెక్టర్ తో పనిచేసే  సౌల‌భ్యం వేరుగా ఉంటుందా?

అలాగేం లేదు. తన హీరో ఇలా వుండాలి, ఇలా చూపించాలని ప్రతి దర్శకుడికి వుంటుంది.

Ravi Teja, Sudheer Varma, Abhishek Nama’s Ravanasura Releasing On April 7, 2023,Anu Emmanuel, Megha Akash, Faria Abdullah,Telugu Golden TV,My Mix Et,telugu world news,www.teluguworldnow.comరచయిత ప్రసన్న గురించి

ప్రసన్న అద్భుతంగా రాశాడు. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రసన్న, త్రినాధరావు కాంబో చక్కగా కుదిరింది. వాళ్ళ కాంబినేషన్ లో అన్నీ వర్క్ అవుట్ అయ్యాయి. ఇదీ అలానే వుంటుంది.

శ్రీలీల పెద్ద స్టార్ అవుతుందని చెప్పారు కదా ?

ఖచ్చితంగా పెద్ద స్టార్ అవుతుంది. అందం, ప్రతిభ రెండూ వున్నాయి. మంచి డ్యాన్సర్, వాయిస్, ఎనర్జీ అన్నీ వున్నాయి. పైగా తెలుగమ్మాయి. తప్పకుండా పెద్ద స్టార్ అవుతుంది.

కథల ఎంపిక విషయంలో మీ జడ్జ్ మెంట్ ఎలా వుంటుంది. ?

కథ నచ్చితే ఓకే చేస్తాను. ఇంకాస్త పక్కాగా చేసుకొని రమ్మంటాను. ముందు కథ నచ్చాలి. కథ నచ్చకుండా కాంబినేషన్ గురించి చేసే ప్రసక్తే లేదు. నేనే కాదు ఎవరూ కథ నచ్చకుండా చేయరు.

Mass Maharaja Ravi Teja, Sreeleela, Trinadha Rao Nakkina, TG Vishwa Prasad’s DHAMAKA Mass Cracker (Teaser) Unleashed, Movie Releasing In December,Telugu Golden TV,My Mix Entertainments,telugu world news,www.teluguworldnoపీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో మళ్ళీ మళ్ళీ పని చేస్తాని చెప్పారు కదా ?

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు అద్భుతం. నాకు చాలా నచ్చారు. వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టం. చాలా పాజిటివ్ గా వుంటారు. అలాంటి వారికీ విజయాలు వస్తే చాలా మందికి ఉపాది కలుగుతుంది. అలాంటి వారికి హిట్లు రావాలి. వారితో ఎన్నిసార్లయిన పని చేస్తాను.

ఓటీటీ మీ ఆలోచన ధోరణిని మార్చిందా ?

లేదు. ఓటీటీ వేరు, థియేటర్ వేరు. ఓటీటీ కి నేను ప్రభావితం కాను.

మీ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నారు కదా ? కథలు వింటారా ?

తప్పకుండా వింటాను. నిర్మాతకు కథ తెలియాలి. పెట్టుబడి పెడుతున్నాం. గుడ్ బ్యాడ్ అగ్లీ అన్నీ తెలుసుకుంటాం. మా బ్యానర్ లో వచ్చే సినిమాలు గురించి త్వరలో చెబుతాం.

Megastar Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby, Mythri Movie Makers Mega154 Dubbing Begins, Title Teaser For Diwali,Telugu Golden TV,My Mix Entertainments,telugu world news,www.teluguworldnow.comమీ అబ్బాయిని హీరోగా ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు ?

దానికి చాలా టైమ్ వుంది. ప్రస్తుతానికి ఆలోచనే లేదు. చదువుకుంటున్నాడు.

వాల్తేరు వీరయ్య గురించి ?

పవర్ ఫుల్ కారెక్టర్ చేస్తున్నా. పండక్కి చూసి మీరు చెప్పండి. చిరంజీవి గారంటే నాకు చాలా ఇష్టం. అన్నయ్యతో సినిమా చేయడం గొప్ప అనుభవం. కథ, క్యారెక్టర్ అద్భుతంగా కుదిరాయి. పైగా బాబీ దర్శకుడు.

పాన్ ఇండియా సినిమాల గురించి ?

కథలో పాన్ ఇండియా కంటెంట్ వుండాలి. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'టైగర్ నాగేశ్వర రావు' చేస్తున్నా . అది చాలా బావుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.

వరుసగా సినిమాలు చేస్తున్నారు కదా.. ఈ ఫేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారా ?

నేను జీవితంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాను. షూటింగ్ అంటే పండగ నాకు. నాకు ఏ రోజు బోర్ కొట్టదు. బోర్ అనే పదం నా డిక్షనరీ లో లేదు.

Mass Maharaja Ravi Teja, Sreeleela, Trinadha Rao Nakkina, People Media Factory’s DHAMAKA Mass Cracker (Teaser) On 21st October,Telugu Golden TV,My Mix Entertainments,telugu world news,www.teluguworldnow.com మీ ప్లానింగ్స్ ఏమిటి ?

నేను పెద్దగా ప్లాన్ చేసుకోను. ఫ్యూచర్ గురించి పెద్దగా ఆలోచించను. ప్రజంట్ ని ఎంజాయ్ చేస్తాను.

మీలో కొత్తగా వచ్చిన మార్పులు ?

నాకు ఊహ తెలిసినప్పటికీ నుండి ఇలానే వున్నాను. నెగిటివిటీ పక్కన పెట్టేసి ఆనందంగా పాజిటివ్ గా ఉండటమే తెలుసు. నా స్ట్రగుల్ ని కూడా ఎంజాయ్ చేశాను. నా లైఫ్ లో ఎలాంటి రిగ్రేట్ లేదు. నేను ఎలాంటి ఒత్తిడి తీసుకొను.

ఆల్ ది బెస్ట్

థాంక్స్

Advertisement
Author Image