For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Devotional : ఆర్దిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా... ఈ చిట్కాలు మీకోసమే !

12:35 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:35 PM May 13, 2024 IST
devotional   ఆర్దిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా    ఈ చిట్కాలు మీకోసమే
Advertisement

Devotional : సాధారణంగా డబ్బు అందరికీ అవసరమే. డబ్బు అంటే అవసరం, ఆశ లేని వారు ఈరోజుల్లో ఎవరు లేరనే చెప్పొచ్చు. ధనవంతులు అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ, అందరూ ఆ కోరికను తీర్చుకోలేరు. అయితే ధనవంతులు కావాలన్నా, ఆర్ధిక సమస్యలన్నీ తొలగిపోవాలన్న అందుకు లక్ష్మీదేవి కటాక్షం కావాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ధనలక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలంటే... ప్రతిరోజూ కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలంటున్నారు నిపుణులు. ఆ విధంగా లక్ష్మిదేవి కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా...

నిద్రలేచాక అరచేతిని చూసుకోవాలి : మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి. అలాగే లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోండి. ఇలా చేయడం వల్ల సరస్వతిమాత, లక్ష్మిదేవి ఇద్దరూ ప్రసన్నం అవుతారని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement GKSC

తులసి పూజ : ఇంట్లో తులసి మొక్క ఉండడం చాలా శుభశకునంగా భావిస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ఆ కుటుంబం లోని కోరికలన్నీ తీరుస్తుందని అంటున్నారు.

ఈశాన్యంలో గంగా జలం : ఇంటి ఈశాన్య కోణం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రతికూల శక్తులు ఈ భాగాన్ని సంగ్రహించడానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి దుష్టశక్తులు ఇంటి నుండి దూరంగా ఉండాలంటే, మీరు క్రమం తప్పకుండా గంగాజలాన్ని ఈశాన్యంలో చల్లుకోవాలి.

తూర్పు ముఖంగా భోజనం : ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు దిశగా చూస్తూ భోజనం చేసేలా చూసుకోవాలి. ఆ దిశ సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

Advertisement
Author Image