Devotional : ఉదయం నిద్ర లేచిన వెంటనే వీటిని చూస్తే చాలా మంచిదని తెలుసా..!
Devotional : సాధారణంగా మనం నిద్ర లేచిన వెంటనే మనకి బాగా నచ్చిన వాళ్ళ ముఖం చూస్తాం. లేదా కొంతమంది తమ చేతులను చూసుకొని ప్రార్ధించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే నిద్ర లేచిన వెంటనే వాస్తు ప్రకారం వీటిని చూస్తే చాలా మంచిది అని వాస్తు పండితులు అంటున్నారు. అలాగే వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందని కూడా చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఎటువంటి వాటిని మనం లేచిన తర్వాత చూడాలి అనే విషయాలు మీకోసం ప్రత్యేకంగా...
దేవుడి ఫోటోలు, నచ్చిన వారి ఫోటోలు : అదే విధంగా చాలా మందికి దేవుడి ఫోటోలను, బాగా నచ్చిన వారి ఫోటోలు చూసుకోవడం అలవాటుగా ఉంటుంది. ఇది కూడా వాస్తు ప్రకారం మంచిదని అంటున్నారు. ఇందువల్ల మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందని చెబుతున్నారు.
అద్దం : వాస్తు ప్రకారం ఉదయం లేచిన వెంటనే అద్దంలో చూసుకుంటే చాలా మంచిది అని సూచిస్తున్నారు. దీని వల్ల నెగటివ్ ఎనర్జీని తొలగించి... పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుందని చెబుతున్నారు. కానీ మీరు అద్దంలో చూసే ముందు ఒకసారి మీ ముఖాన్ని కడుక్కుని ఆ తర్వాత అద్దంలో చూసుకోవాదం ముఖ్యం.
భయంకరమైన జంతువులు : ఉదయం లేచిన తర్వాత భయంకరమైన జంతువులని చూడడం ఆ రోజంతా నెగటివ్ గా ఉంటామంటున్నారు.
శుభ్రం చేయని సామాన్లు : రాత్రి తినేసి శుభ్రపరచని సామాన్లను చూడకూడదని... అవి నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుందని తెలుపుతున్నారు. అందుకే రాత్రి తిన్న సామాన్లను శుభ్రం చేసుకోవాలి లేకపోతే నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుందని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.