ఆంజనేయ స్వామి మరికొన్ని జీవిత విశేషాలు మీ కొరకు.
Devotional News: రాముని బంటు ఆంజనేయ స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దుష్టశక్తుల సైతం ఆంజనేయ స్వామికి భయపడాల్సిందే. భయాలతో కూడిన లేదా ఒంటరిగా ఉన్న రాత్రి సమయం ప్రయాణిస్తున్న ఆంజనేయ స్వామిని స్మరించుకుంటే చాలు ధైర్యం వచ్చేస్తుంది. అటువంటి గొప్పవారు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి కేవలం రాముని బంటు గా మాత్రమే అందరికీ తెలుసు. అయితే ఆయన చిన్నతనం నుండి చాలా మంది రాక్షసులను సంహరించిన గొప్ప వీరుడనే చెప్పుకోవాలి. అటువంటి ఆంజనేయులు గురించి ఆసక్తికరమైన విషయాలు మీ కొరకు తెలుసుకోండి.
వాయుదేవుడు అంజనా దేవి పుత్రుడే ఆంజనేయుడు పుట్టుకతోనే సూర్య భగవానుని వణికిచ్చిన మహావీరుడు గా చెప్పుకోవచ్చు. ఆంజనేయ స్వామి శ్రీరాముని భక్తునిగా యుగయుగాల వింటూనే ఉంటున్నాం. రావణలంకను తగలబెట్టిన చిచ్చర పిడుగు గా కూడా ఆంజనేయ స్వామి తెలుసు. అలానే సముద్రాలను ఈదుకుంటూ సీతమ్మవారిని సీతమ్మవారికి ధైర్యం చెప్పిన రామయ్యను సీతమ్మను కలిపిన మహా ధైర్యవంతుడు మన ఆంజనేయస్వామి. అలానే హనుమంతుడిని మహా గొప్ప సాధువు కూడా చెప్పుకోవచ్చు దైవభక్తి మాత్రమే తన జీవితంలో భావించారు వివాహ అనే బంధానికి శాశ్వతంగా స్వస్తి చెప్పారు హనుమంతుడు.
హిమాలయాల నుండి సముద్ర తీరాల వరకు ఆయన పూజలను అందుకుంటూనే ఉన్నారు. ఎవరైనా పెద్దవారు చిన్న పిల్లలకు దేవుని భక్తిలో లీనం అవ్వాలంటే ఆంజనేయ స్వామి చూసి నేర్చుకోరా అంటూ చెబుతూ ఉంటారు. భూతపిచాలను సంహరించడంలో ఆంజనేయ స్వామికి ఎదురులేదని చెప్పుకోవాలి అటువంటి గొప్ప బలసాని మన రాముని భక్తి అయినా ఆంజనేయస్వామి.