Entertainment ఫ్యాన్స్‌కు నటి వైష్ణవి గుడ్‌న్యూస్.. త్వరలోనే తల్లిగా ప్రమోషన్
Entertainment దేవత సీరియల్ తెలుగులో బుల్లితెరపై విశేష ఆదరణ దక్కించుకుంది ఈ సీరియల్ ఎంతగా పాపులర్ అయిందో అందులో నటీనటులు కూడా అంతే పాపులర్ అయ్యారు అయితే ఇందులో హీరోయిన్ కి చెల్లిగా నటించినా వైష్ణవి బాగా ఫేమస్ అయింది కొనాలి సీరియల్ లో చేసిన తర్వాత వాహ్ వైష్ణవి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫాన్స్ కి అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ నటి..
ఫ్యాన్స్ తో తరచూ టచ్‌లో ఉంటూ.. ప్రతి విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటోంది. ఇటీవలే ఆమె ఓ సీరియల్ డైరెక్టర్ సురేష్ కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే చాలా రోజుల నుంచి వైష్ణవి తన యూట్యూబ్ ఛానల్ లో ఎలాంటి వీడియోలు పోస్ట్ చేయలేదు దీంతో అప్సెట్ అయినా ఆమె అభిమానులు ఏంటా అని చూస్తే ఓ గుడ్ న్యూస్ తెలిసింది..
తాజాగా ఓ కొత్త వీడియోతో ఆమె ఫ్యాన్స్ ముందుకు వచ్చి సర్ప్రైజ్ చేసింది. అదేంటంటే.. ఆమె త్వరలోనే తల్లి కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. వారి కుటుంబంలోకి రాబోతున్న కొత్త వ్యక్తి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నట్టు తెలిపింది.. ఈ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తన ఆరోగ్యం కూడా కాస్త బాలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమెకు విషెస్ తెలుపుతున్నారు.
