For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Chiranjeevi :చిరంజీవి పక్కన ఛాన్స్ వద్దు అనుకున్న యంగ్ హీరో .. కారణం ఏమై వుంటుందో తెలుసుకోవాలి అంటే

10:26 AM Jul 14, 2023 IST | Sowmya
Updated At - 10:26 AM Jul 14, 2023 IST
chiranjeevi  చిరంజీవి పక్కన ఛాన్స్ వద్దు అనుకున్న యంగ్ హీరో    కారణం ఏమై వుంటుందో తెలుసుకోవాలి అంటే
Advertisement

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలను మించి బిజీగా ఉన్నారు. అంతేకాదు మెగా ఫ్యామిలో ఎంతోమంది నటీనటులు ఉన్నా తన పక్కన నటించే అవకాశం కొత్తగా వచ్చిన నటీనటులకే ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో చిరంజీవి నటించిన చాలా చిత్రాల్లో యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేశారు. కొత్త దర్శకులు, నటీనటులతో సినిమాలు చేస్తూ టాటెంట్‌కే పెద్దపీట వేస్తున్నారు. త్వరలో చేయబోయే రెండు సినిమాలకూ యంగ్ డైరెక్టర్స్ నే ఎంపిక చేశారు మెగాస్టార్. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వశిష్ట, బంగార్రాజు మూవీతో హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో చిరంజీవి సినిమాలు రాబోతున్నాయి.

ఇలా తన కొత్త ప్రాజెక్టులకు యంగ్ డైరెక్టర్లకు అవకాశం ఇచ్చిన చిరంజీవి.. తన సినిమాలో యువ నటీనటులను తీసుకోవాలని భావించారట. గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ కు అవకాశం ఇచ్చినట్లు.. దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చేసే మలయాళ రిమేక్ చిత్రం బ్రో డాడీలో మరో యంగ్ హీరోకి అవకాశం ఇవ్వాలని చూశారు. చిరంజీవితోపాటు కీ రోల్ ఉండే పాత్రకు ఓ యంగ్ హీరో అవసరమయ్యారు. ఈ పాత్రకు ఎంతో మందిని పరిశీలించిన చిత్రం యూనిట్.. డిజె టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) అయితే ఆ పాత్రకు సరిపోతారని ఫిక్స్ అయ్యారట.. అంతేకాదు తమ ప్రతిపాదనను సిద్ధుకు కూడా చెప్పినట్లు ఇండస్ట్రీ టాక్.

Advertisement GKSC

చిరంజీవితో సినిమా చేయాలని టాలీవుడ్‌లో ఎన్నో కలలు కంటుంటారు. ఎప్పుడెప్పుడు చాన్స్ వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. కానీ.. సిద్ధూ మాత్రం బ్రో డాడి మూవీలో చాన్స్ వద్దనుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. చిరుతో కలసి నటించడానికి సిద్ధూ ఇష్టపడటం లేదంటున్నారు. చిరంజీవి పక్కన ఉంటే తనకు యాక్టింగ్ స్కోప్ చాలా తక్కువ ఉంటుందని, ఆడియోన్స్ దృష్టి మొత్తం మెగాస్టార్ పైనే ఉంటుందని, ఆ కారణంగా చిరంజీవి పక్కన నటించకపోవడమే బెటర్ అని చెబుతున్నాడట ఈ కుర్ర హీరో.

Advertisement
Author Image