For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Kushi :నా రోజా నువ్వే’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సెట్..తాజాగా మరో సాంగ్ రిలీజ్...

10:01 AM Jul 13, 2023 IST | Sowmya
Updated At - 10:01 AM Jul 13, 2023 IST
kushi  నా రోజా నువ్వే’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సెట్  తాజాగా మరో సాంగ్  రిలీజ్
Advertisement

Kushi : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కలిసి నటిస్తున్న లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. లవ్ స్టోరీస్ ని బాగా తెరకెక్కించే శివ నిర్వాణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ‘నా రోజా నువ్వే’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సెట్ చేసింది. తాజాగా ఇప్పుడు మరో సాంగ్ ని రిలీజ్ చేశారు.

మణిరత్నం సినిమా టైటిల్స్ తో మొదటి పాటకి లిరిక్స్ రాసిన శివ నిర్వాణ.. ఆరాధ్య పాటకి కూడా సాహిత్యం అందిస్తున్నాడు. ఈ లిరిక్స్ కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ పాటని సిద్ శ్రీరామ్, చిన్మయి పాటని పాడారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు.

Advertisement GKSC

ఇక ఈ మూవీ చిత్రీకరణ విషయానికి వస్తే.. సమంత అనారోగ్యం కారణంతో షూటింగ్ లేటు అవుతూ వచ్చింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వడంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టారు. సెప్టెంబర్ 1న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. విజయ్, సమంత గత సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ లుగా నిలిచాయి. దీంతో వీరిద్దరి అభిమానులు ఒక్క హిట్టు కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ వారి కోరికను నెరవేరుస్తుందా? లేదా? చూడాలి.

Advertisement
Author Image