For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Varun Sandesh : సినిమా షూటింగ్ లో వరుణ్ సందేశ్ కి ప్రమాదం .. కాలికి గాయాలు ....

11:09 AM Jun 22, 2023 IST | Sowmya
Updated At - 11:09 AM Jun 22, 2023 IST
varun sandesh   సినిమా షూటింగ్ లో  వరుణ్ సందేశ్ కి ప్రమాదం    కాలికి గాయాలు
Advertisement

Varun Sandesh :తెలుగు ఇండస్ట్రీలో కొంతకాలం యూత్‌ఫుల్ సినిమాలతో అలరించిన హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh Accident) గాయాల పాలయ్యారు. ఇటీవలే సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మైఖేల్’ చిత్రంలో నెగెటివ్ రోల్‌ పోషించిన ఆయన ప్రస్తుతం ‘ది కానిస్టేబుల్’ (The Constable) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు కాలికి గాయమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ ఆగిపోయింది.

Advertisement GKSC

జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై బలగం జగదీష్ నిర్మిస్తున్న ‘ది కానిస్టేబుల్’ చిత్రానికి ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక కానిస్టేబుల్ లైప్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయ్యింది. అయితే ఇప్పుడ సడెన్‌గా వరున్ సందేశ్‌ కాలికి గాయం కావడంతో షూటింగ్‌ను వాయిదావేసినట్ల దర్శకుడు వెల్లడించారు. శంకరపల్లి దగ్గరలోని టంగుటూరు గ్రామంలో పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.

ఇక వరుణ్ కెరీర్ విషయానికొస్తే.. ‘హ్యాపీ డేస్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘కొత్త బంగారు లోకం’ మూవీ సక్సెస్‌తో వరుస అవకాశాలు అందుకున్నాడు. కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అవకాశాలు కోల్పోయాడు. ఇదే క్రమంలో భార్యతో కలిసి బిగ్ బాస్‌ రియాలిటీ షోలో పాల్గొ్న్నాడు వరుణ్. అయితే తన కెరీర్‌కు అది కూడా పెద్దగా ఉపయోగపడినట్లు లేదు. ఇలాంటి తరుణంలోనే ‘ది కానిస్టేబుల్’తో పాటు ‘యద్భావం తద్భవతి’ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు గాయం కారణంగా షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది.

Advertisement
Author Image