For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Vaishnavi Chaitanya: స్టార్ హీరో పక్కన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి చైతన్య .. నెక్స్ట్ మూవీ ఏంటో తెలుసుకోవాలి అంటే ....

01:01 PM Aug 04, 2023 IST | Sowmya
Updated At - 01:01 PM Aug 04, 2023 IST
vaishnavi chaitanya  స్టార్ హీరో పక్కన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన వైష్ణవి చైతన్య    నెక్స్ట్ మూవీ ఏంటో తెలుసుకోవాలి అంటే
Advertisement

Vaishnavi Chaitanya : తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అంటూ యాక్టింగ్ కెరీర్ స్టార్ చేసింది. సినిమా అంటే ఇష్టంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇండస్ట్రీలో తనని తాను నిరూపించుకుంది. షార్ట్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి కొన్ని పెద్ద సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఇక హీరోయిన్ గా వైష్ణవి చేసిన ఫస్ట్ సిల్వర్ స్క్రీన్ మూవీ బేబీ (Baby). ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా నేడు 75 కోట్లకు పైగా అందుకొని ముందుకు దూసుకుపోతుంది.

థియేటర్స్ వద్ద ఈ సినిమాకి వస్తున్న ఆదరణ చూస్తుంటే.. లాంగ్ రన్ లో ఈ సినిమా 100 కోట్లు అందుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా మొదటి సినిమాలోనే ఒక ఛాలెంజింగ్ రోల్ చేసి వైష్ణవి అందర్నీ ఆకట్టుకుంది. సినిమాలో తన యాక్టింగ్ చూసి స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు కూడా ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఛాన్సులు కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వైష్ణవికి అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ లో ఒక సినిమా ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement GKSC

తాజాగా ఇప్పుడు ఒక స్టార్ హీరో పక్కన, ఒక సూపర్ హిట్ సీక్వెల్ లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది. హీరో రామ్, పూరీజగన్నాధ్ కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) ని సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. బేబీ మూవీలోని వైష్ణవి యాక్టింగ్ చూసి పూరి ఫిదా అయ్యి ఈ సీక్వెల్ లో ఒక హీరోయిన్ పాత్ర కోసం వైష్ణవిని తీసుకున్నాడట. ఇటీవల రామ్ కూడా వైష్ణవికి పుష్పగుచ్ఛాన్ని పంపించి బేబీ సక్సెస్ కి కంగ్రాట్యులేట్ చేశాడు.

Advertisement
Author Image