For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tillu 2: టిల్లు మూవీ న్యూ అప్డేట్ ...ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్...

10:23 AM Jul 25, 2023 IST | Sowmya
Updated At - 10:23 AM Jul 25, 2023 IST
tillu 2   టిల్లు మూవీ న్యూ అప్డేట్    ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్
Advertisement

Tillu  : గత ఏడాది చిన్న సినిమాగా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మూవీ డీజే టిల్లు. సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ (Siddhu Jonnalagadda), నేహా శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా రొమాంటిక్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చి యూత్ లో భారీ క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ సినిమాలో సిద్దు స్లాంగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ కి టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యిపోయారు. ఇక ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు. మూవీ అనౌన్స్‌మెంట్ చేసి ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రకటించి భారీ హైప్ ని క్రియేట్ చేశారు.

ఇక సిద్దు అండ్ అనుపమతో ఈ సీక్వెల్ ఎలా ఉండబోతుందో అని అందరిలో ఆసక్తి నెలకుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ.. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ‘టికెటే కొనకుండా’ అని సాగే ఈ ఫుల్ సాంగ్ ని జులై 26న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇక రిలీజ్ చేసిన ప్రోమో అందర్నీ ఆకట్టుకుంటుంది. సాంగ్ లిరిక్స్ కాకుండా పాటకి ముందు ఉండే సీన్ చూపించారు. సిద్దు, అనుపమతో మాయ మాటలు చెబుతున్న సీన్ ఆకట్టుకునేలా ఉంది.

Advertisement GKSC

”బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే నా షూ నేను వేసుకొని పోతా. బాయ్ ఫ్రెండ్ లేడంటే నిన్ను ఏసుకొని పోతా” అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. మొదటి పార్ట్ కి కొనసాగింపు గానే ఈ మూవీ రానుంది. ఇక డీజే టిల్లుని విమల్ కృష్ణ తెరకెక్కిస్తే.. ఈ సీక్వెల్ ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి సిద్దునే కథని అందిస్తున్నాడు. రామ్ మిర్యాల ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

Advertisement
Author Image