Tamannaah:అభిమాని తో ఎయిర్‌పోర్టులో'కావాలయ్యా ' సాంగ్ డాన్స్ అధరగొట్టేసిన తమన్నా ....
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఫుల్ ఫార్మ్ లో ఉంది. వరుసపెట్టి సినిమాలను రిలీజ్ సిద్ధం చేస్తూ ప్రమోషన్స్ తో తెగ సందడి చేస్తుంది. ఇటీవలే లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories) తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ భామ.. ఇప్పుడు మరో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతుంది. చిరంజీవి ‘భోళా శంకర్’ (Bholaa Shankar), రజినీకాంత్ ‘జైలర్’ (Jailer) సినిమాలు ఆగష్టులో ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ కాబోతున్నాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీలోని పాటలను రిలీజ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల జైలర్ చిత్రం నుంచి ‘వా నువు కావాలయ్యా’ సాంగ్ ని రిలీజ్ చేశారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ పాటకి జానీ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. ఇక ఈ పాట యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ అందుకుంటూ ట్రెండ్ అవుతుంది. తాజాగా తమన్నా ముంబయి ఎయిర్‌పోర్టులో కనిపించగా అక్కడ ఒక అభిమాని ‘కావాలయ్యా’ సాంగ్ కి తనతో కలిసి డాన్స్ వేయాలంటూ కోరాడు. అందుకు తమన్నా కూడా అంగీకరించడంతో.. ఇద్దరు కలిసి ఆ పాటకి ఎయిర్‌పోర్ట్‌లో డాన్స్ వేసి అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇది ఇలా ఉంటే, ఈ సాంగ్ పై తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ (Vijay Varma) చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పాటను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ఈ సాంగ్ ఫైర్.. సినిమా దేవుడు, దేవత అని పోస్ట్ చేశాడు. అంటే పాటలో సినిమా దేవుడు రజినీకాంత్, సినిమా దేవత తమన్నా ఉన్నారు అంటూ చెప్పాడు.