For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Sreeleela :తన కెరీర్ ఏమవుతుందో అనే టెన్షన్ లో శ్రీలీల...కృతి శెట్టికి ఎదురైన సమస్య వస్తుందేమో అనే టెన్షన్..

11:50 AM Aug 12, 2023 IST | Sowmya
Updated At - 11:50 AM Aug 12, 2023 IST
sreeleela  తన కెరీర్ ఏమవుతుందో అనే  టెన్షన్ లో  శ్రీలీల   కృతి శెట్టికి ఎదురైన సమస్య వస్తుందేమో అనే టెన్షన్
Advertisement

Sreeleela : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో తెరగేట్రం చేసిన శ్రీలీల.. రవితేజ ధమాకాతో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌తో డజనుకు పైగా సినిమాలతో బిజీ అయిపోయింది. ఇకేముందు తగ్గేదేలే అనుకుంటున్న టైమ్‌లో శ్రీలీలకు కొత్త సమస్య వచ్చిపడింది.

బ్యూటీ క్వీన్ శ్రీలీలకు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉంది. ఆమె కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. యంగ్ హీరోలు తమ సినిమాకు మొదటి ఆప్షన్‌గా శ్రీలీలనే ఎంచుకుంటున్నారు. ధమాకా సినిమా తర్వాత బిజీ అయిపోయిన శ్రీలీల చేతిలో ఇప్పుడు దాదాపు పది సినిమాలు ఉన్నాయి. తెలుగులో తొలి సినిమా యావరేజ్ అయినా అందం, అభినయంతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపే తెచ్చుకుంది శ్రీలీల. అందుకే ఈ అందాల భామకు అంత డిమాండ్. కానీ ఈ మధ్య శ్రీలీలకు ఓ టెన్షన్ పట్టుకుందట. రవితేజతో సక్సెస్ సాధించిన శ్రీలీల.. ఆ స్పీడ్‌లో వరుస సినిమాలు ఒప్పేసుకుంది. ఇందులో ఇద్దరు ప్లాప్ హీరోలు ఉండటంతో తన కెరీర్ ఏమవుతుందోనని టెన్షన్ పడుతోందట శ్రీలీల.

Advertisement GKSC

ప్రస్తుతం శ్రీలీల మహేశ్‌బాబు గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది. అదేవిధంగా పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్, బాలయ్య భగవంత్ కేసరిలో ఓ ముఖ్య పాత్ర చేస్తోంది. మరోవైపు రామ్ స్కందలోను వైష్ణవ్ తేజ్ ఆదికేశవలోనూ, నితిన్ తో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాల్లో శ్రీలీల హీరోయిన్. ఐతే రామ్, వైష్ణవ్ తేజ్‌, నితిన్ లు ముగ్గురి గత సినిమాలో ఫ్లాప్ కావడంతో తన కెరీర్ కి ఎఫెక్ట్ అవుతుందేమో అని టెన్షన్‌తో ఆందోళన చెందుతోందట శ్రీలీల.

మహేశ్‌బాబు సినిమా విడుదలకు ముందు ఈ సినిమాలు విడుదలయ్యే చాన్స్ ఉండటం, అవి ఏమాత్రం దెబ్బతీసినా తన కెరీర్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని మదనపడుతోందట ఈ అందాల భామ. ఇంతకు ముందు కృతి శెట్టికి ఎదురైన అనుభవంతో జాగ్రత్త పడాలని అనుకుంటోదట శ్రీలీల. తనలాగే కృతి శెట్టి కూడా ముందు వెనుక ఆలోచించకుండా వరుస సినిమాలు చేసి దెబ్బ తిందని తన పరిస్థితి అలా తయారవ్వొద్దని జాగ్రత్తగా ఉండాలని అనుకుంటోందట ఈ బ్యూటీ. మరి ఈ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ టెన్షన్ తగ్గాలంటే రామ్, వైష్ణవ్ తేజ్, నితిన్ సినిమాల్లో సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవాల్సిందే.

Advertisement
Author Image