For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Skanda Song : స్కంద మూవీ న్యూ అప్డేట్ .. మూవీ నుండి సెకండ్ సింగల్ ప్రోమో రిలీజ్....

09:05 AM Aug 18, 2023 IST | Sowmya
Updated At - 09:05 AM Aug 18, 2023 IST
skanda song   స్కంద మూవీ న్యూ అప్డేట్     మూవీ నుండి సెకండ్ సింగల్ ప్రోమో రిలీజ్
Advertisement

Skanda Song : మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్కంద’. ఇక రామ్ కి జంటగా శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఇప్పటికే గ్లింప్స్ అండ్ ఒక సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. తాజాగా సినిమాలోని సెకండ్ సింగల్ ప్రోమోని రిలీజ్ చేశారు.

థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ‘గందరాబాయి’ అంటూ సాగే ఈ పాటకి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా నాకాష్ అజిజ్, సౌజన్య భగవతుల గానం చేశారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సాంగ్ ని కోరియోగ్రఫీ చేశాడు. ఇక మొన్న మొదటి సాంగ్ లో స్టైలిష్ డాన్స్ మూవ్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన రామ్ అండ్ శ్రీలీల.. ఈసారి మాస్ స్టెప్పులు వేసి విజుల్స్ వేయిస్తున్నారు. చిన్న ప్రోమోలోనే ఓ రేంజ్ స్టెప్పులు చూపించారు . ఇక  ఈ ఇద్దరు ఫుల్ సాంగ్ లో థియేటర్స్ ని దద్దరిలించడం ఖాయంలా కనిపిస్తుంది.

Advertisement GKSC

కాగా ఈ మూవీ పూర్తి కమర్షియల్ ఎంటర్టైన్ గా ఉండబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో సాంగ్స్ ని ఆ భాషల్లో కూడా తెలుగుతో పాటే రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Advertisement
Author Image